తమన్నాను దారుణంగా ట్రోల్ చేస్తున్న బాలీవుడ్ ఫ్యాన్స్

సినిమా పరిశ్రమలో నిర్మాతలు గ్లామర్ కు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందాలు చూపించే హీరోయిన్ కి ఉండే రేంజ్ ప్రాణం పెట్టి నటించే వాళ్లకు ఉండదు అనే మాట వాస్తవం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 9, 2024 | 06:31 PMLast Updated on: Sep 09, 2024 | 6:31 PM

Bollywood Fans Trolles Tamannaah

సినిమా పరిశ్రమలో నిర్మాతలు గ్లామర్ కు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందాలు చూపించే హీరోయిన్ కి ఉండే రేంజ్ ప్రాణం పెట్టి నటించే వాళ్లకు ఉండదు అనే మాట వాస్తవం. సినిమా పరిశ్రమలోనే కాదు చాలా రంగాల్లో ఈ రోగం ఉంది అనే మాట వాస్తవం. ఐటెం సాంగ్స్ విషయంలో నిర్మాతలు పక్కా లెక్కలతో ఉంటారు. ఒక స్టార్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయిస్తే తమ సినిమాకు ఆడియన్స్ పెరుగుతారు అనే భావనలో ఉండి హీరోయిన్లకు భారీగా ఆఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలా చేసే బాలీవుడ్ లో నిర్మాతలు విమర్శలు ఎదుర్కొంటున్నారు.

మేటర్ లోకి వెళ్తే… మన తెలుగులో ఒక వెలుగు వెలిగి లేటు వయసులో ముంబైలో బిజీ అవ్వాలని భావిస్తున్న మిల్కీ బ్యూటి తమన్నా అక్కడ భారీ ప్రాజెక్ట్ ల కోసం గాలం వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు మూడు సినిమాలకు ఆమె సైన్ కూడా చేసింది. ఇటీవల విడుదలైన ఒక సినిమా మంచి హిట్ కూడా అయింది. ఆ సినిమానే స్త్రీ 2. ఆ సినిమాలో తమన్నా ఒక ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగ్ కు స్పందన పర్వాలేదు గాని కాని ఆమెకు ఇచ్చిన రెమ్యునరేషన్ మాత్రం భారీగా ఉందనే విమర్శలు వచ్చాయి.

ఈ సినిమాలో తన నటనతో బాగా ఆకట్టుకున్న అభిషేక్ బెనర్జీకి ఇచ్చిన రెమ్యునరేషన్ కేవలం 55 లక్షలు. ఒక్క ఐటెం సాంగ్ చేసిన తమన్నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ కోటి రూపాయలు. అసలు ఏం చూసి కోటి రూపాయలు ఇచ్చారని నిర్మాతలను ప్రశ్నిస్తున్నారు బాలీవుడ్ ఫ్యాన్స్. ఈ మేరకు సోషల్ మీడియాలో పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి. చర్మం తెల్లగా ఉంటే నిర్మాతలకు చాలని, కాస్త రంగు తక్కువగా ఉండి నటన చూపించినా వాళ్లకు కనపడదు అంటూ విమర్శిస్తున్నారు. కాగా ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి.