ఇలా తగులుకున్నారు ఏంట్రా…? పాట్నా ఈవెంట్ తో బాలీవుడ్ లో టన్నుల్లో భయం
ఒకప్పుడు సౌత్ ఇండియా సినిమాలను నార్త్ లో రిలీజ్ చేయడానికి మన స్టార్ హీరోలకు పెద్ద టాస్క్ లా ఉండేది. హాలీవుడ్ దెయ్యం సినిమాలను మన తెలుగులో చూసిన దాని కంటే మన తెలుగు సినిమాలను నార్త్ లో చూడటం తక్కువగా ఉండేది.
ఒకప్పుడు సౌత్ ఇండియా సినిమాలను నార్త్ లో రిలీజ్ చేయడానికి మన స్టార్ హీరోలకు పెద్ద టాస్క్ లా ఉండేది. హాలీవుడ్ దెయ్యం సినిమాలను మన తెలుగులో చూసిన దాని కంటే మన తెలుగు సినిమాలను నార్త్ లో చూడటం తక్కువగా ఉండేది. యుట్యూబ్ వచ్చిన తర్వాత డబ్ చేసి రిలీజ్ చేయడం స్టార్ట్ చేసారు. వాటికి కాస్తో కూస్తో మంచి వ్యూస్ వచ్చేవి. హిందీ కంటే పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తెలుగు సినిమాలను ఎక్కువగా చూస్తూ ఉంటారు. వాళ్లకు హిందీ అంటే నచ్చదు కాబట్టి మన సినిమాలు చూసేవారు… చూస్తున్నారు… చూస్తారు.
ఇప్పుడు నార్త్ లో లెక్క మారింది. బాహుబలి నుంచి మారిన ఈ లెక్క… ఆర్ఆర్ఆర్ సినిమాతో పీక్స్ కు వెళ్లి… పుష్ప 2 తో ఆకాశాన్ని తాకింది. బాలీవుడ్ ను అన్నేళ్ల పాటు శాసిస్తున్న హీరోలు ఎవరికి లేని ఇమేజ్ ఇప్పుడు నార్త్ లో ప్రమోషన్స్ తో మన హీరోలకు పెరుగుతోంది. ఒక్కో సినిమాకు ఒక్కో రేంజ్ లో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా సినిమాకు ప్రమోషన్ ఈవెంట్స్ లెక్క బాలీవుడ్ ను తొక్కుతోంది. ఆర్ఆర్ఆర్ ఈవెంట్స్ ను చాలా గ్రాండ్ గా చేసారు మేకర్స్. పంజాబ్ లో కూడా ఓ ఈవెంట్ చేసారు.
ఆ ఈవెంట్ కు జనాలు భారీగానే వచ్చారు. పంజాబ్ కాబట్టి… హిందీ సినిమాలకు అంత బొమ్మ లేదు కాబట్టి వచ్చారు… ఓకే… కానీ… పుష్ప 2 ఈవెంట్ కు మాత్రం జనాలు పిచ్చ పిచ్చగా వచ్చారు. అది రాజకీయ పార్టీ మీటింగ్ ను బీట్ చేసే రేంజ్ లో వచ్చారు. ఇది చూసి బాలీవుడ్ జనాలు కూడా షాక్ అవుతున్నారు. మమ్మల్ని ఇలా తగులుకున్నారు ఎంట్రా అంటూ నెత్తిన గుడ్డ వేసుకునే పరిస్థితి వచ్చింది. నిజం చెప్పాలంటే… బాలీవుడ్ సినిమాలకు ఇప్పుడు అంత ఆదరణ రావడం లేదు. సీనియర్ హీరోల సినిమాలు ఏడాదికి ఒకటి కూడా రిలీజ్ కావడం లేదు.
కాని మన సౌత్ నుంచి భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. కల్కీ, దేవర, కంగువ, ఇప్పుడు పుష్ప 2 ఇలా అన్నీ బాలీవుడ్ ను డామినేట్ చేస్తూనే ఉన్నాయి. తమిళ సినిమాలు, కన్నడ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము రేపుతున్నాయి. అక్కడి హీరోలు మన దగ్గర విలన్లు అవుతున్నారు. పుష్ప 2 ఈవెంట్స్ ఇంకా ఆరు ఉన్నాయి. ఈ ఆరు ఏ రేంజ్ లో చేస్తారో చూడాలి. నార్త్ ఈవెంట్స్ ను ఇంకెంత గ్రాండ్ గా ప్లాన్ చేసారో చూడాలి. ఫ్యూచర్ లో ఇదే కంటిన్యూ కావడం కాదు… ఇంకా పెరుగుతుంది అనే క్లారిటీ సినిమా సినిమాకు వస్తుంది. చూద్దాం.. బాలీవుడ్ భవిష్యత్తు ఏంటో…