Bollywood: సల్మాన్ కి పూజ హెగ్డే అంతగా నచ్చిందా? డేటింగా.? ఓన్లీ మూవీ షూటింగా?

సల్మాన్‌ఖాన్‌కు నచ్చడం చాలా కష్టం. ఒకవేళ నచ్చితే మాత్రం హీరోయిన్‌ పంట పండినట్టే.. వద్దనేవరకు ఛాన్సులిస్తూనే వుంటాడు. సినిమా ఇండస్ట్రీలో ఎవరూ పట్టించుకోకపోయినా.. తన సినిమాల్లో వరుస ఆఫర్స్ ఇస్తాడు. ఇప్పుడీ జాబితాలో పూజా హెగ్డే కూడా చేరింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2023 | 07:30 PMLast Updated on: Mar 27, 2023 | 7:30 PM

Bollywood Hero Salman And Pooja In Dating

సల్మాన్‌ఖాన్‌ పక్కన ఒకే హీరోయిన్‌ చాలా సినిమాల్లో కనిపిస్తుంది. కత్రినా కైఫ్‌కు స్టార్‌డమ్‌ వచ్చేవరకు ఛాన్సులు ఇచ్చాడు. స్టార్‌ అయిన తర్వాత కూడా.. చివరికి లవ్‌ బ్రేకప్‌ తర్వాత కూడా ఆమెనే హీరోయిన్‌గా తీసుకున్నాడు. నచ్చిన హీరోయిన్ని సల్మాన్‌ వదిలిపెట్టడు. సినిమా ఇండస్ట్రీ పొమ్మన్నా.. నేనున్నానంటూ ఛాన్సులిచ్చి కెరీర్‌కు బూస్టప్‌ ఇస్తాడు. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ విషయంలో ఇదే జరిగింది. సల్మాన్‌ ఆశీస్సులతో వెండితెరపై మెరిసింది కరోనా టైంలోనూ.. ఈ అమ్మడితో వీడియో తీసి.. జాక్వెలిన్‌ను పాపులర్‌ చేశాడు.

మొన్న కత్రినా కైప్‌.. నిన్న జాక్వెలిన్‌ ఇప్పుడు పూజా హెగ్డే. ఈ అమ్మడితో చేస్తున్న మూవీ ‘కిసీ కా భాయ్‌.. కిసి కి జాన్‌’ రిలీజ్‌ కాకుండానే.. మరో ఆఫర్‌ ఇచ్చేశాడు. భజ్‌రంగీ భాయూజాన్‌ సీక్వెల్‌ మూవీ ‘పవన్‌పుత్ర’ పేరుతో వస్తుందని కిందటేడు ప్రకటించారు. అయితే.. ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్‌ లేవు. ఇందులో సల్మాన్‌కి జోడీగా పూజాహెగ్డే నటించనుందని సినీవర్గాలు ప్రకటించాయి. ఈ సీక్వెల్‌ను సల్మాన్‌ఖాన్‌ సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భజ్‌రంగీలో నటించిన కరీనాకపూర్‌ను కాదని పూజాహెగ్డేను తీసుకోవడంతో ఫిలిం వర్గాలు షాక్‌ అయ్యాయి.

కత్రిన.. జెక్వెలిన్‌ మాదిరి.. సల్మాన్ ప్రస్తుతం పూజా మోజులో వున్నాడని.. తనదైన స్టైల్లో బహుమతిగా ఈ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చాడని.. ఈ ఇద్దరూ డేటింగ్‌లో వున్నారంటూ బీటౌన్‌లో కథనాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. పూజాహెగ్డేకు ఆర్నెల్ల నుంచి ఛాన్సులు దక్కలేదు. చేతిలో వున్న మహేశ్‌, త్రివిక్రమ్‌ మూవీ తప్ప మరో సినిమా లేదు. తెలుగులో కెరీర్‌ అయిపోయిందనుకుంటున్న టైంలో.. సల్మాన్‌ఖాన్‌ అండదండలు పుష్కలంగా లభించాయి. ఈ ఇద్దరి కాంబోలో ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే.. మరో ఆఫర్‌ ఇచ్చేశాడు. తెలుగులో ఉస్తాద్‌లో ఈ అమ్మడి పేరు వినిపిస్తున్నా.. ఇచ్చేది రెండు కోట్లేనట. సల్మాన్‌ మాత్రం .. నాలుగు కోట్లు ఇచ్చి.. ఆదుకున్నాడన్న టాక్‌ నడుస్తోంది.