మళ్ళీ ఎన్టీఆర్ కు ఎస్.. పుష్పకు నో.. బాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ రిప్లై

దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ పెరిగిపోతోంది. ఆ సినిమాను ఎవరు ఎన్ని విధాలుగా ట్రోల్ చేసినా సరే.. హిట్టు కొట్టి చూపించాడు ఎన్టీఆర్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 12, 2025 | 12:30 PMLast Updated on: Feb 12, 2025 | 12:30 PM

Bollywood Heroines Shocking Reply

దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ పెరిగిపోతోంది. ఆ సినిమాను ఎవరు ఎన్ని విధాలుగా ట్రోల్ చేసినా సరే.. హిట్టు కొట్టి చూపించాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్ లెవెల్ లో వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎన్టీఆర్ ను తక్కువ అంచనా వేసిన వాళ్లందరూ ఇప్పుడు చేతులు కాల్చుకున్నారు. ఇక దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా బిజీ అయిపోవడం కాయంగా కనబడుతోంది. ఇప్పటికే వార్ 2 సినిమా తో తన వర్క్ మొదలు పెట్టిన ఎన్టీఆర్.. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ఇప్పుడు తిరిగి హైదరాబాద్ వచ్చేసాడు.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమా కోసం వర్క్ స్టార్ట్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ గ్రాండ్ గా లాంచ్ అవుతుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్.. అల్లు అర్జున్ సినిమా కోసం ఆఫర్ వస్తే కాదని.. ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి ఓకే చేసిందట. స్త్రీ 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సుమారు 500 కోట్ల రూపాయలు కలెక్షన్స్ చేసి.. రికార్డు క్రియేట్ చేసిన ఈ బ్యూటీ… ఇప్పుడు ఐటమ్ సాంగ్ విషయంలో అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చి ఎన్టీఆర్ కు షేక్ అండ్ ఇచ్చింది.

సాహో సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు బాలీవుడ్ లో చాలా బిజీగానే ఉంది. ఈమెకు టాలీవుడ్ లో కూడా భారీగానే అభిమానులు ఉన్నారు. ఆషికి 2 సినిమాతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో బిజీ అయిన ఈ అమ్మాయి.. ఇప్పుడు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో కూడా ఫోకస్ పెడుతోంది. వాస్తవానికి ఈమెను అల్లు అర్జున్… త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఆమె మాత్రం అల్లు అర్జున్ సినిమాలో యాక్ట్ చేయడానికి అంగీకరించలేదు.

కానీ.. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న.. మేకర్స్ శ్రద్ధా కపూర్ ను ఈ సినిమాలో తీసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ఫైనల్ చేశారు మేకర్స్. సెకండ్ హీరోయిన్ గా నటించడానికి ఓకే చెప్పిన ఈమె.. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో హీరోయిన్ గా నటించడానికి మాత్రం నో చెప్పింది. గతంలో కూడా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఈమె నో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్న వార్ 2 సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ కూడా చేసింది. ఇలా ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అల్లు అర్జున్ సినిమాలో నటించడానికి నో చెప్పడం మాత్రం సెన్సేషన్ అయింది.