ఎన్టీఆర్ పై బాలీవుడ్ హీరో సెన్సేషనల్ కామెంట్స్.. వాళ్ళు వింటే చచ్చిపోతారేమో..?
గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దానికి ప్రత్యేకంగా కారణాలు అవసరం లేదు.

గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దానికి ప్రత్యేకంగా కారణాలు అవసరం లేదు. చాలా రోజుల తర్వాత ఆయన మీడియా ముందుకు రావడమే దీనికి కారణం. వచ్చీ రావడంతోనే తన సత్తా చూపిస్తున్నాడు తారక్. ఒకవైపు ఆయన వేరే వాళ్ల గురించి మాట్లాడిన మాటలు.. మరోవైపు ఆయన మీద వేరే వాళ్ళు మాట్లాడిన మాటలు రెండూ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో కూడా హాట్ టాపిక్ అవుతున్నాడు ఎన్టీఆర్. అక్కడ వార్ 2 సినిమా చేస్తున్నాడు ఈయన. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది అని మరో హీరో హృతిక్ రోషన్ కన్ఫర్మ్ చేశాడు. ముంబైలోని ఓ ప్రోగ్రాం కు వచ్చిన ఈయన జూనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. మీకు ఇష్టమైన హీరో ఎవరు అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాడు హృతిక్ రోషన్.
25 ఏళ్లుగా బాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈయన.. నాకు ఇష్టమైన కోస్టార్ ఎన్టీఆర్ అంటూ చెప్పేసరికి సోషల్ మీడియా మొత్తం తగలబడిపోతుంది. హృతిక్ సమాధానం విన్న తర్వాత బాలీవుడ్లో చాలామందికి నిద్ర కూడా పట్టదేమో. ఇంతమంది హీరో హీరోయిన్లతో పని చేసిన తర్వాత కూడా.. ఫేవరెట్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ అని హృతిక్ చెప్పేసరికి ముంబైలోని బాంద్రా ఏరియా ఒక్కసారిగా షేక్ అయిపోయి ఉంటుంది. చేసిందే ఒక్క సినిమా.. ఇంకా అది రిలీజ్ కాలేదు.. అప్పుడే తారక్ గురించి ముంబై ఇంతగా మాట్లాడుకుంటే.. రేపు వార్ 2 హిట్ అయితే పరిస్థితి ఏంటి అనేది ఊహించుకోవచ్చు. వార్ 2 సినిమా కోసం ఏరిపోరి ఎన్టీఆర్ ను సెలెక్ట్ చేసుకున్నాడు దర్శకుడు అయాన్ ముఖర్జీ. నిజానికి ఎన్టీఆర్ ను ఈ సినిమాలో తీసుకున్నప్పుడు చాలామంది విమర్శించారు. హృతిక్ రోషన్ ఎక్కడ.. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ.. ఆయన ముందు మనోడు ఎక్కడ నిలబడుతాడు సరిపోతాడా అసలు అంటూ హేళన చేశారు. కానీ ఇప్పుడు ఆ హృతిక్ రోషనే మన ఎన్టీఆర్ ను తోపు అంటున్నాడు.
తారక్ ను ఏ నమ్మకంతో అయితే దర్శకుడు అయాన్ ముఖర్జీ తీసుకున్నాడో.. ఇప్పుడు హృతిక్ మాటలతో అది నిజమే అని ప్రూవ్ అయింది. ఈ సినిమా కోసం జూనియర్ తనను తను చాలా మార్చుకున్నాడు. హృతిక్ రోషన్ ముందు నిలబడాలంటే బాడీ కూడా బాగా ఉండాలి.. అందుకే సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. డాన్స్ ల విషయంలో ఇద్దరికీ పేరు పెట్టాల్సిన అవసరం లేదు. సినిమాలో ఇద్దరి మధ్య పోటా పోటీగా సాగే రెండు పాటలు ఉంటాయని తెలుస్తోంది. ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది. అదే రోజు రజనీకాంత్ కూలి సినిమా వస్తున్నా కూడా తగ్గేదే లేదు అంటున్నారు వార్ టీం. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. వార్ సినిమా వచ్చినప్పుడు దానికి పోటీగా చిరంజీవి సైరా వచ్చింది.. దాని ఫలితం ఏమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వార్ సీక్వెల్ వస్తునప్పుడు కూలి వస్తుంది.