Bollywood Khans: తారక్‌, చెర్రీని బీట్‌ చేసేందుకు కష్టపడుతున్న ఖాన్లు..

ఇండియన్‌ సినిమా చరిత్రలో ట్రిపులార్‌ ఓ గోల్డెన్‌ చాప్టర్‌. ఇండియా అంటే బాలీవుడ్‌ మాత్రమే కాదు.. ఇండియన్‌ హీరోలంటే సల్మాన్‌, షారుఖ్‌ మాత్రమే కాదు. ఇక్కడ ప్రతీ లాంగ్వేజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసే సినిమాలు ఉన్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 23, 2023 | 02:44 PMLast Updated on: May 23, 2023 | 2:44 PM

Bollywood Khans Hard Work For Beet The Tollywood Heros

దేశం గర్వించే హీరోలు ఉన్నారని ప్రపంచానికి చాటి చెప్పింది ట్రిపులార్‌ సినిమా. ఇప్పుడు బాలీవుడ్‌ హీరోల టార్గెట్‌ ట్రిపులార్‌ సినిమాను మించిన సినిమా తీయడం. ఇందుకోసం సల్మాన్‌ ఖాన్‌ హీరోగా వస్తున్న టైగర్‌-3 సినిమాను చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారు. ఈ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో షారుఖ్‌ కనిపించబోతున్నాడు. వీళ్లద్దరి మధ్య ఉండే చేసింగ్‌ సీన్‌.. సినిమా మొత్తానికి ఐకానిక్‌గా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట. ఈ సీన్‌ను కంపోజ్‌ చేసేందుకు హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ పని చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సీన్‌ కోసం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తున్నారట. హాలీవుడ్‌ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఈ ఫైట్‌ సీన్‌ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట.

ఈ సీన్‌లో సల్మాన్‌, షారుఖ్‌తో పాటు హృతిక్‌ రోషన్‌ కూడా కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ ఒక్క సీన్‌ను షూట్‌ చేసేందుకు మేకర్స్‌ ఏకంగా 30 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌లకు మంచి ఫేమ్‌ ఉంది. ఇక ఈ ఇద్దరూ ఒకే స్క్రీన్‌ మీద కనిపిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే. ఇప్పటికే షారుఖ్‌ హీరోగా వచ్చిన పఠాన్‌లో షారుఖ్‌ను సేవ్‌ చేసే రోల్‌లో 10 నిమిషాలు కనిపించాడు సల్మాన్‌. ఇప్పుడు సల్మాన్‌ హీరోగా వస్తున్న టైగర్‌-3లో షారుఖ్‌ కూడా గెస్ట్‌ రోల్‌ చేయబోతున్నాడు. యష్‌రాజ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌లో వస్తున్న ఈ సినిమాను సౌత్‌లోని అన్ని లాంగ్వేజెస్‌లో డబ్‌ చేస్తున్నారట. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న మనీష్‌ శర్మ.. ట్రిపులార్‌ను క్రాస్‌ చేసే రేంజ్‌లో అవుట్‌పుట్‌ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారట. ఈ ముగ్గురు హీరోలు కలిసి తారక్‌, చెర్రీని బీట్‌ చేస్తారో లేదో చూడాలి.