Gadar 2: దారిలో పడ్డ బాలీవుడ్.. ఊపు తెచ్చిన గదర్ 2, ఓఎంజీ2
పఠాన్‌తో బాలీవుడ్ భారీ కలెక్షన్స్ చూసినా ఆతర్వాత వచ్చిన చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ చేతులెత్తేశాయి. సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ రూ.100 కోట్లు కలెక్ట్ చేయడం గగనమైపోయింది. అక్షయ్‌కుమార్ సినిమాలు వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయినా ఓ మై గాడ్2 మాత్రం కాస్త ఊరటనిస్తోంది.
Gadar 2: చాలాకాలం తర్వాత బాలీవుడ్ లైన్లో పడింది. కరోనా తర్వాత మూడేళ్లపాటు కోలుకోని హిందీ ఇండస్ట్రీ గాడిలో పడి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఏదో మూడు నెలలకో హిట్ అన్న చందాన కాకుండా.. వచ్చిన సినిమా వచ్చినట్టే.. బాక్సాఫీస్‌ను మెప్పించేస్తోంది.
పఠాన్‌తో బాలీవుడ్ భారీ కలెక్షన్స్ చూసినా ఆతర్వాత వచ్చిన చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ చేతులెత్తేశాయి. సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ రూ.100 కోట్లు కలెక్ట్ చేయడం గగనమైపోయింది. అక్షయ్‌కుమార్ సినిమాలు వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయినా ఓ మై గాడ్2 మాత్రం కాస్త ఊరటనిస్తోంది. ఓ మై గాడ్ వంటి సూపర్ హిట్‌కు సీక్వెల్ కావడంతో ఈ సీక్వెల్‌పై భారీ అచంనాలున్నాయి. అయితే గదర్2 సీక్వెల్ అక్షయ్‌కుమార్ మూవీ ఓపెనింగ్స్‌పై నీళ్లు చల్లింది. ఈ శుక్రవారం బాలీవుడ్‌లో రెండు సీక్వెల్స్ సందడి చేశాయి. 22 ఏళ్ల క్రితం వచ్చిన సన్నీడియోల్ గదర్‌కు రీమేక్ కావడంతో గదర్ 2 భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మొదటిరోజే రూ.40 కోట్ల నెట్ వసూలు చేసి బాలీవుడ్‌కు షాక్ ఇచ్చింది.
ఫస్ట్ డే పఠాన్ రూ.54కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ టాప్ మూవీగా రికార్డ్ బ్రేక్ చేస్తే.. గదర్2 రూ.40 కోట్లతో ఈ ఏడాది బాలీవుడ్ టాప్ సెకండ్ మూవీగా నిలిచింది. ఓ మై గాడ్2కు మంచి టాకే వచ్చినా గదర్2కు కూడా పాజిటివ్ టాక్ రావడం ఓఎంజీ2 చిత్ర కలెక్షన్లపై ప్రభావం చూపింది. దీంతో వరుస ఫ్లాపుల్లో వున్న అక్షయ్ కంటే గదర్2పై ఆడియన్స్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్ కారణంగా ఫస్ట్ డే ఆ మూవీ రూ.40 కోట్లు కలెక్ట్ చేసింది. ఓ మైగాడ్2 ఫస్ట్ డే రూ.10 కోట్లు మాత్రమే వచ్చినా తర్వాత నెమ్మదిగా వసూళ్లు పెరిగాయి. క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ ఒకేసారి రావడంతో కలెక్షన్స్ పంచుకోవాల్సి వచ్చింది. రణ్‌వీర్‌సింగ్, అలియా భట్ జంటగా కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన ‘రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ జులై 28న రిలీజై రెండోవారంలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే కొత్త సినిమాలు ఈ వసూళ్లకు బ్రేకులేశాయి. సినిమా ఇప్పటికే రూ.150 కోట్ల మార్క్ దాటింది. గదర్2.. ఓ మై గాడ్2 రాకతో ఈ ప్రేమ కథ వెనుకపడిపోయినా.. ఈస్థాయి కలెక్షన్లు రావడం విశేషమే. పఠాన్ బ్లాక్‌బస్టర్ తర్వాత బాలీవుడ్ చాలా డిజాస్టర్స్ ఫేస్ చేసింది. ఈ టైంలో వచ్చిన లవ్ స్టోరీ ‘తు ఝూటి మై మక్కర్’ రూ.140 కోట్లు తీసుకొచ్చింది. రణ్‌బీర్ కపూర్, శ్రద్దా కపూర్ జంటగా నటించిన ఈ సినిమా ఒకరకంగా ప్రేమకథలకు ఊపిరి పోసిందనే చెప్పాలి.
ఒకప్పుడు ప్రేమ కథలకు హిందీ ఇండస్ట్రీ కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అయితే వరుస ఫ్లాపులతో హీరోలు చాలామంది యాక్షన్ వైపు మళ్లారు. చాలాకాలం తర్వాత ప్రేమ కథలు వరుసగా హిట్ కావడంతో మేకర్స్‌లో కొత్త ఉత్సాహం నింపింది. తు ఝూటి మై మక్కర్ రూ.140 కోట్లు.. రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్‌కహాని రూ.150 కోట్లు తీసుకురావడంతో బాలీవుడ్ ప్రేమకథలకు బూసప్ట్ ఇచ్చినట్టయింది. మూడేళ్లపాటు వరుస ఫ్లాపులతో నరకం చూసిన బాలీవుడ్ వరుస సక్సెస్‌లతో దారిలో పడడమే కాదు అప్‌కమింగ్ రిలీజెస్‌లో ఉత్సాహం నింపింది. ఈమధ్యకాలంలో బాలీవుడ్ హిట్స్ ఏమిటంటే ఆలోచించాల్సిన పరిస్థితి నుంచి బైటపడింది. రెండు వారాల్లో రిలీజైన మూడు సినిమాలకు పాజిటివ్ టాక్‌రావడం గదర్2 మొదటిరోజే రూ.40 కోట్లు తీసుకురావడం చూస్తుంటే బాలీవుడ్ కష్టాలు తీరినట్టే అనిపిస్తోంది.