Rajamouli: రాజమౌళిని ఆకాశానికెత్తిన కరన్‌ జోహార్‌.. ఇది సార్‌ జక్కన్న రేంజ్‌..

ఎస్‌ఎస్‌ రాజమౌళి. కొంత మందికి ఇది జస్ట్‌ పేరే కావొచ్చు. కానీ సినిమా లవర్స్‌కు మాత్రం అదొక బ్రాండ్‌. సాధారణంగా స్టార్‌హీరోల చుట్టూ డైరెక్టర్స్‌ తిరుగుతారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 4, 2023 | 12:04 PMLast Updated on: Jun 04, 2023 | 12:04 PM

Bollywood Producer Karan Johar Price To Rajamouli

కానీ ఆ స్టార్‌ హీరోలు మాత్రం రాజమౌళి చుట్టూ తిరుగుతారు. ఎవరు అడిగినా డేట్స్‌ ఇస్తారో లేదో కానీ.. జక్కన్న నుంచి కాల్‌ వచ్చిందంటే మాత్రం సంవత్సరాలకు సంవత్సరాలు డేట్స్‌ ఇచ్చేస్తుంటారు. ఇది సినీ ఇండస్ట్రీలో ఆయనకున్న క్రేజ్‌. ఇక ట్రిపులార్‌ సినిమా తరువాత రాజమౌళి రేంజ్‌ విశ్వవ్యాప్తమైంది.

తెలుగు సినిమా ఖ్యాతిని శికరాగ్రాన నిలబెట్టిన రాజమౌళికి సినీ ప్రపంచం దాసోహమైంది. భాషతో సంబంధం లేకుండా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు రాజమౌళిని ఆకాశానికెత్తేస్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కరన్ జోహార్‌ రాజమౌళి గురించి చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వూలో.. గేమ్‌ ఆఫ్‌ త్రోన్స్‌, అవెంజర్స్‌ లాంటి సినిమాలు ఇండియాలో ఎందుకు రావడంలేదు.. ఎవరి దగ్గర అంత డబ్బు లేదా అంటూ కరణ్‌ను అడిగాడు హోస్ట్‌. దానికి కరన్‌ “ఇండియాలో కేవలం ఒక్క రాజమౌళి మాత్రమే ఉన్నాడు.

ఇంకో రాజమౌళి ఉంటే ఖచ్చితంగా గేమ్‌ఆఫ్‌ త్రోన్స్‌, అవెంజర్‌ లాంటి సినిమాలు ఇండియాలో కూడా వచ్చేవి. మా దగ్గర డబ్బు లేక కాదు. ఆ స్థాయిలో సినిమా తీసే వ్యక్తి రాజమౌళి ఒక్కడే అవ్వడం. ఆయన తన ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల అలాంటి సినిమాలు రావడంలేదని చెప్పాడు. రాజమౌళి గురించి కరన్‌ చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీని చిన్న చూపు చూసిన బాలీవుడ్‌ ఇప్పుడు టాలీవుడ్‌ డైరెక్టర్‌ను ఆకాశానికెత్తడంతో టాలీవుడ్‌ ఆడియన్స్‌ కాలర్‌ ఎగరేస్తున్నారు. ఇది సార్‌ రాజమౌళి రేంజ్‌ అంటున్నారు.