Ranbir Kapoor : 250 కోట్ల ఆస్తిని కూతురుకి ఇస్తాడా
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోల్లో ఒకరు రణభీర్ కపూర్(Ranbir Kapoor). సావరియా తో తన సినీ జర్నీని ప్రారంభించి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు.

Bollywood star hero Ranbir Kapoor who made 250 crore property in his daughter's name
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరోల్లో ఒకరు రణభీర్ కపూర్(Ranbir Kapoor). సావరియా తో తన సినీ జర్నీని ప్రారంభించి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాడు. రీసెంట్ గా యానిమల్ తో ఇండియా మొత్తాన్ని షాక్ చేసాడు. తాజాగా ఆయన తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియన్ ఇండస్ట్రీ అయ్యింది.
2022 లో తన సహా నటి అలియా భట్ (Alia Butt ) ని రణబీర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి రాహా అనే ఒక పాప పుట్టింది. తన వయసు సంవత్సరంలోపే ఉంటుంది. ఇప్పుడు ఈ పాప పేరు మీద 250 కోట్ల విలువైన ఇంటిని రణబీర్ రాస్తున్నాడనే విషయం సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది. రణబీర్ తన కూతురు కి రాసే ఇల్లు ఎక్కడ ఉందని ఎంక్వయిరీ కూడా చేస్తున్నారు. ఆ ఇల్లు ముంబై లోనే అత్యంత ఖరీదు ప్రాంతమైన బాంద్రా లో ఉంది. ప్రస్తుతం ఇల్లు నిర్మాణ దశలో ఉంది. మరికొన్ని రోజుల్లోనే పూర్తి అయిపోతుంది. రణబీర్ ఆ ఇంటిని తరచు సందర్శిస్తున్నాడని తెలుస్తుంది.
రణబీర్ రీసెంట్ గా యానిమల్ తో 900 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించాడు. తండ్రి మీద పిచ్చి ప్రేమని పెంచుకొని తండ్రి కోసం ఏమైనా చేసే క్యారక్టర్ లో సూపర్ గా నటించాడు.నిజ జీవితంలో ఆయన తండ్రి పేరు రిషి కపూర్. 80 , 90 వ దశకంలో బాలీవుడ్ లో హీరోగా చేసి చిత్ర పరిశ్రమ మొత్తాన్ని ఒక ఊపు ఊపాడు. తల్లి నీతూ సింగ్ కూడా ఎన్నో హిందీ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.ఇక రణబీర్ కపూర్ భార్య అలియా భట్ గురించి అందరకి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యింది.