Sharukh Khan: చేసిన తప్పుకి గుండు గీసేశారు.. అప్పట్లో పవన్ ఇప్పుడు షారుఖ్..
షారుఖ్ ఖాన్ మొన్నే పఠాన్ తో హిట్ సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ పనైపోయిందనగానే, సీన్లో కొచ్చిన బీటౌన్ ని కాపాడాడు. అంతా బాగుంది అనుకున్న టైంలో తన తప్పులకు గానూ, గుండు గీసే పరిస్థితి వచ్చిందన్న వార్త వైరలైంది.

Bollywood star hero Shah Rukh Khan is doing a film under the direction of Atlee in which Shah Rukh will be seen with a shaved head
ఐదారేళ్ళుగా సినిమాలు తీయలేదు. చేసిన ఒక మూవీ పఠాన్ రిలీజ్ టైంలో తన కొడుకు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. కూతురు ఆర్చీస్ చేస్తుంటే లేడీ షారుఖ్ ఖాన్ అంటూ తన రంగుని కామెంట్ చేశారు. దీనికి తోడు ఐదేళ్ల క్రితం వరకు కూడా వరుస ప్లాపులతోనే డీలా పడ్డాడు షారుఖ్.
అలాంటి తను తీసుకున్న ఒకే ఒక్క మంచినిర్ణయం, సౌత్ దర్శకుడితో మూవీ చేయాలనుకోవటం. అలా ఆట్లీ మేకింగ్ లో జవాన్ చేశాడు. టీజర్ ఆమధ్య పేలింది. కొత్త ప్రోమో వచ్చాకే అందులో గుండుతో తన దర్శనమైంది. హిట్ కోసం షారుఖ్ కి ఆట్లీ ఇలా గుండు గీశాడనంటున్నారు.
శంకర్ మేకింగలో ఆమధ్య వచ్చిన శివాజీకి ఆట్లి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అందులో రజినీకాంత్ కి గుండు లో చూపించాలన్నది ఆట్లీ ఐడియానేనట. సో అదే ఐడియాను షారుఖ్ కి అప్లై చేశాడు ఈ దర్శకుడు. సో మొత్తానికి వరుస ఫ్లాపులతో డీలాపడ్డ షారుఖ్ కి హిట్ కావాలంటే, గుండు గీయాల్సిందే అన్న ఆట్లీ ఆలోచన వర్కవుట్ అవుతుందో లేదో కాని, పటాన్ హిట్ తర్వాత వస్తున్న మూవీ కావటం, ఫస్ట్ టైం షారుఖ్ ని గుండులో చూడాల్సి వస్తుండటంతో, అంతా షాక్ అవుతున్నారు.