Bollywood: హీరోల కొడుకులు కాదు.. ఇకనుంచి కూతుర్ల సత్తా చూడండి.. మాకేం తక్కువ అంటున్నారు స్టార్ డాటర్స్

త్వరలో బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు సిద్దమైన స్టార్ హీరోల కూతుళ్లు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 23, 2023 | 12:41 PMLast Updated on: Aug 23, 2023 | 12:41 PM

Bollywood Star Heroes Are Bringing Women From Their Family As Heroines

హీరోల వారసులు హీరోలు కావడం.. దర్శకుల పిల్లలు దర్శకులు కావడం అన్ని ఇండస్ట్రీలో కామన్. కానీ వీళ్లలో అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈ ట్రెండ్ కి బ్రేక్ వేస్తూ వెండితెరపై ఎంట్రీ ఇచ్చేందుకు సై అంటున్నారు స్టార్ డాటర్స్. త్వరలో బిగ్ స్క్రీన్ పై సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు.

బాలీవుడ్ బాద్షా షారుఖ్ కూతురు సుహానా ఖాన్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. న్యూయార్క్ లో యాక్టింగ్ అండ్ డ్రామా కోర్సు పూర్తి చేసిన తను ది గ్రే పార్ట్ ఆఫ్ బ్లూ షార్ట్ ఫిల్మ్ లో నటించి మంచి మార్కులే కొట్టేసింది. చదువు పూర్తవగానే సినిమాలపై దృష్టి పెట్టిన తను ఇప్పుడు ది ఆర్చీస్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. 1960 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ కామెడీ సిరీస్ కి జోయా అక్తర్ డైరెక్టర్. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకురానుంది.

బాలీవుడ్ లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది రవీనా టాండన్. టిప్ టిప్ బర్ సా పానీ తో నార్త్ ఆడియన్స్ ని ఓ ఊపు ఊపింది. ఇప్పుడు తన కూతురు రాషా ని బాలీవుడ్ లోకి దింపుతోంది. అజయ్ దేవగణ్ సోదరుడి కుమారుడు అమన్ దేవగణ్ తో కలిసి రాషా తెరంగేట్రం చేయనుంది.యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది.

స్టార్ హీరో హృతిక్ రోషన్ కజిన్, రాజేష్ రోషన్ కూతురు పష్మీనా రోషన్ సైతం సినిమాల్లో అడుగు పెడుతోంది. ఇష్క్ విష్క్ కి సీక్వెల్ గా వస్తున్న ఇష్క్ విష్క్ రీబౌండ్ లో జిబ్రాన్ ఖాన్ ,రోహిత్ సరాఫ్ లతో పష్మీనా రొమాన్స్ చేయనుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే సల్మాన్ ఖాన్ మేనకోడలు అలీజే అగ్ని హోత్రి ఇప్పటికే మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పుడు జామ్ తారా ఫేం సుమేంద్ర పధీ డైరెక్షన్ లో ఓ మూవీ చేయడానికి సైన్ చేసింది. సెప్టెంబర్ లో ఈ సినిమా పట్టాలెక్కనుంది.

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్ లో పాగా వేసింది. రెండు ,మూడు సినిమాల్లో బాలనటిగా కనిపించిన ఖుషి కపూర్ ఇప్పుడు జాన్వీ బాటలో నడిచేందుకు సిద్ధమైంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఆర్చీస్ లో బెట్టీ కూపర్ అనే కీలక పాత్రలో నటిస్తోంది. ఇక సంజయ్ కపూర్ వారసురాలు షనాయా కపూర్ కి ముందునుంచీ సినిమాల్లోకి రావడానికి ఆసక్తి ఎక్కువే. గుంజన్ సక్సేనా కి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన షనాయా ప్రజెంట్ మోహన్ లాల్ వృషభ లో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే కరణ్ జోహార్ నిర్మిస్తున్న బేథక్ లో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. మొత్తానికి స్టార్ డాటర్స్ అంతా పాత ట్రెండ్ కి బ్రేక్ వేసి కొత్త కథలతో వెండితెరపై మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు.మరి ఇందులో ఎంతమంది స్టార్ బ్యూటీస్ అవుతారో చూడాలి.