స్టార్ హీరోయిన్ కు క్రిమినల్ భారీ గిఫ్ట్… వైరల్ అవుతున్న లవ్ లెటర్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలీన్ ఫెర్నాండెజ్ మరోసారి న్యూస్ లో హైలెట్ అయింది ఆమెకు.. ఆర్థిక నేరగాడు ఒకడు పంపిన భారీ గిఫ్ట్ నేషనల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలీన్ ఫెర్నాండెజ్ మరోసారి న్యూస్ లో హైలెట్ అయింది ఆమెకు.. ఆర్థిక నేరగాడు ఒకడు పంపిన భారీ గిఫ్ట్ నేషనల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. క్రిస్మస్ కానుకగా ఆమెకు ఎంతో ఖరీదైన గిఫ్ట్ ను పంపించాడు ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్. అలాగే క్రిస్మస్ మెసేజ్ కూడా ఒక లెటర్ రూపంలో పంపిస్తూ బేబీ గర్ల్ మై లవ్ అంటూ క్యాప్షన్ రాశాడు. బేబీ గర్ల్, మేరీ క్రిస్మస్ మై లవ్ మనకెంత ఇష్టమైన పండుగ ఇది అంటూ లవ్ లెటర్ స్టార్ట్ చేశాడు. కాకపోతే మనిద్దరం కలిసి జరుపుకోలేకపోతున్నామని ఏది ఏమైనా మన మనసులు ఎంతో చేరువయ్యాయి అని ఆ లెటర్లో రాసుకొచ్చాడు.
నీ చేతులు పట్టుకుని అందమైన నీ కళ్ళల్లో చూస్తూ క్రిస్మస్ విషెస్ చెప్పాలని ఉందని దూరంగా ఉన్నప్పటికీ నేను నీ శాంతాక్లాజ్ నను కాకుండా ఎవరూ ఆపలేరంటూ ఇంట్రెస్టింగ్ గా రాశాడు. ఈ ఏడాది నీకు చాలా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నానని.. ఈ రోజు నీకు వైన్ బాటిల్ గిఫ్ట్ గా ఇవ్వడం లేదని నువ్వు ఎప్పుడూ కలల కనే కంట్రీ ఆఫ్ లవ్ గా అభివర్ణించే పారిస్ లో ఒక వైన్ యార్డ్ నే కానుకగా ఇస్తున్నా అంటూ కామెంట్ చేశాడు. ఆ తోటలో నీ చేయి పట్టుకుని నడవాలి ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు.
నేనొక పిచ్చోడినని ఈ ప్రపంచం అనుకోవచ్చు… నీ ప్రేమలో నిజంగానే నేను పిచ్చోడిని అయ్యా నేను విడుదల అయ్యే వరకు ఎదురు చూస్తూ ఉండు… ఆ తర్వాత ప్రపంచమే మన జంటను చూస్తుందంటూ ఆ లెటర్ కంప్లీట్ చేశాడు. గతంలో కూడా సుకేష్ ఇలాగే ఆమెకు లెటర్లు రాసుకొచ్చాడు. సుకేష్ ప్రస్తుతం ఢిల్లీ జైల్లో ఉండగా 2020 జూన్ నుంచి మే 2021 వరకు మొబైల్ ఫోన్లు వాయిస్ మాడ్యులర్లు వినియోగిస్తూ రాన్ బాక్సి మాజీ యజమాని శివేందర్ సింగ్ భార్య అతిథి సింగ్ ఫోన్ చేశాడు.
లా సెక్రటరీ అనూప్ కుమార్ గా పరిచయం చేసుకున్న సుఖేష్ ఆమె భర్త కు బెయిల్ ఇప్పిస్తానని 200 కోట్లకు పైగా వసూలు చేసి సెన్సేషన్ అయ్యాడు. అయితే ఎన్నాళ్లకు బెయిల్ రాకపోవడంతో అదితీకి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ఆయన జాక్వేలిన్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి. ఆమెను తన ప్రియురాలుగా చెప్పుకున్నాడు. ఇక సుఖేష్ చంద్రశేఖర్ తన జీవితాన్ని నరకప్రాయం చేశాడని… జాక్వెలిన్ కూడా ఆవేదన వ్యక్తం చేసింది. అతడు తన జీవితంతో ఆడుకుని కెరీర్ ను నాశనం చేశాడని కోర్టులో స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. హోం శాఖలో ముఖ్య అధికారిగా సుకేష్ తనను తాను జాక్వలిన్ కు పరిచయం చేసుకున్నాడట.