రెబల్ స్టార్ దెయ్యంగా మారినా వదలరా… ఆడ దెయ్యాల గోల…

రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కి పడని అమ్మాయి ఉండదు.. బేసిగ్గా డార్లింగ్ అంటే అందరికీ అభిమానమే.. అమ్మాయిలకైతే ప్రత్యే కఅభిమానం...కాకపోతే తనకి దెయ్యాల్లో కూడా ఇంత ఫాలోయింగ్ ఉందా అన్న కామెంట్స్ పెరిగాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 4, 2025 | 06:32 PMLast Updated on: Jan 04, 2025 | 6:32 PM

Bollywood Star Heroins Follows Prabhas

రెబల్ స్టార్ ప్రభాస్ కటౌట్ కి పడని అమ్మాయి ఉండదు.. బేసిగ్గా డార్లింగ్ అంటే అందరికీ అభిమానమే.. అమ్మాయిలకైతే ప్రత్యే కఅభిమానం…కాకపోతే తనకి దెయ్యాల్లో కూడా ఇంత ఫాలోయింగ్ ఉందా అన్న కామెంట్స్ పెరిగాయి. రీజన్ తను దెయ్యంగా మారాడో లేదో, బాలీవుడ్ లో ఏడెనిమిది గ్లామరస్ దెయ్యాలు, క్యూ కట్టాయి… ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజన్ కి మరో పావుడజన్ తోడయ్యాయి. రెబల్ స్టార్ కెరీర్ లోనే ఫస్ట్ టైం హర్రర్ మూవీ చేస్తున్నాడు. అందులోనూ కామెడీ దాడి కి రెడీ అయ్యాడు. అదే ఎలా ఉంటుందా అని అంతా ఎదురుచూస్తుంటే, ప్రభాస్ క్రియేట్ చేసే వేవ్ లో దూసుకెళ్లేందుకు ఏడెనిమిది మంది హీరోయిన్లు రెడీ అయిపోయారు. దెయ్యాల ట్రెండ్ సెట్టర్ గా రెబల్ స్టార్ మారబోతుంటే, అందాల రాక్షసిలా ఏడెనిమిది ఆడ దెయ్యాలు తోడొస్తున్నాయి.

బల్ స్టార్ ప్రభాస్ దెయ్యంగా ఊహించకోవటం కష్టమే.. ఎంతైనా సినీ ఆడియన్స్ కి తను ఓ బాహుబలి… కుదిరితే కల్కీ లేదంటే సలార్ లాంటి మూవీలతో తను సినిమా చేస్తే ఓకే కాని, ఓ ఆత్మగా మారి హర్రర్ కామెడీ మూవీ చేస్తున్నాడంటేనే, ఏమౌతుందో అన్న డౌట్లు, ఎలా ఉంటుందో అన్న కామెంట్లు పెరిగాయి.

ఐతే ఇక్కడ టాపిక్ అది కాదు. హర్రర్ కామెడీ ట్రెండ్ నీ ప్రభాస్ సెట్ చేయబోతుండటం.అప్పట్లో చంధ్రముఖి అంటూ రజినీకాంత్ హర్రర్ కామెడీ సినిమా చేశాడు. ఆ ఫార్ములాతో ట్రెండ్ సెట్ చేశాడు. మళ్లీ ఇరవై ఏళ్ల తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా కింగ్ ప్రభాస్ హర్రర్ కామెడీ చేస్తున్నాడు

ఇదే ఇక్కడ కామన్.. ఇద్దరికీ జపాన్ వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది…..నెగెటీవ్ టాక్ వచ్చిన మూవీలతో కూడా వందలకోట్లు రాబట్టేంత మార్కెట్, జనాల్లో క్రేజ్ ఉంది. అందుకే రజినీకాంత్ తర్వాత ఈ తరంలో హర్రర్ కామెడీ జోనర్ తో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు ప్రభాస్ అంటున్నారు

అంతవరకు బానే ఉంది. ఇందులో తండ్రిగా, తాతగా, మనవడిగా మూడు పాత్రల్లో కనిపించే ప్రబాస్ కోసం ఆల్రెడీ ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ఐతే ఏ పాత్ర మనిషో, మరే పాత్ర ఆత్మో మాత్రం సినిమా రిలీజ్ అయ్యాకే తేలుతుంది.

ఐతే మరి ఇదే ఇప్పుడు ట్రెండ్ కాబోతోందని అనుకున్నారో, లేదంటే కలిసొస్తోందని ఆ జోనర్ మీద మనసు పారేసుకున్నారో కాని, బాలీవుడ్ నిర్మాతలు ఏకంగా 8 హర్ర్ కామెడీ మూవీలకు రెడీ అయ్యారు. హిందీలో స్త్రీ, స్త్రీ 2 రెండూ బ్లాక్ బస్టర్లే. ఇక ముంజియా, బేడియా కూడా హిట్టయ్యాయి. వాటికి సీక్వెల్స రాబోతున్నాయి. ఆలియా నుంచి కరిష్మా వరకు అందరూ ఏ జోనర్స్ లో మెరిసినా ఫ్లాపులు పడుతున్నాయి. కాబట్టే హిట్ కి షార్ట్ కట్ గా హర్రర్ కామెడీని ఎంచుకున్నట్టున్నారు

మొత్తంగా శ్రద్దా కపూర్, కైరా అద్వాని, ఆలియా, శార్వరీ ఇలా ఎనిమిది మంది బాలీవుడ్ హీరోయిన్లు దెయ్యం పాత్రల్లో పాతుకుపోబోతున్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్ట్ కి వాయిదా పడే ఛాన్స్ ఉన్న ది రాజా సాబ్ వచ్చాకే, వరుసగా దసరా, దీపావళి అంటూ రెండేళ్లు బాక్సాఫీస్ మీద దాడి చేయబోతున్నారు. అలా ఈ ఎమిమిది మంది అందాల రాక్షసులు రావాలంటే, ముందుగా ది రాజా సాబ్ బొమ్మాలి అంటూ వణికిస్తూ నవ్వించాలి…