Bollywood: డీ అంటే దోపిడి.. రూ.100 కోట్లు.. బాలీవుడ్ స్టార్స్ రెమ్యునరేషన్
బాలీవుడ్ స్టార్లకు అక్కడ ప్లాపులు పడ్డా ఇక్కడ ఆఫర్ల వల్ల ఎకౌంట్లోకి కో అంటే కోట్లు పడుతున్నాయి. ఏకంగా మనదగ్గర వందకోట్లు నొక్కేశారు హిందీ నటులు. పది సినిమాలు పది మంది నటులు, అందరి రెమ్యునరేషన్లు కలిపితే రూ.వందకోట్లు.
Bollywood: బాలీవుడ్‌లో సినిమాలన్నీ బక్కెట్ తన్నేస్తున్నాయి. ఒక్క పఠాన్ సంగతి వదిలేస్తే, మిగతా సినిమాలు, ఆఖరికి కొత్త మూవీ రాఖీ ఔర్ రాణీ ప్రేమ్ కహానీ కూడా ప్లాప్ అని తేలిపోయింది. కానీ బాలీవుడ్ స్టార్లకు అక్కడ ప్లాపులు పడ్డా ఇక్కడ ఆఫర్ల వల్ల ఎకౌంట్లోకి కో అంటే కోట్లు పడుతున్నాయి. ఏకంగా మనదగ్గర వందకోట్లు నొక్కేశారు హిందీ నటులు.
పది సినిమాలు పది మంది నటులు, అందరి రెమ్యునరేషన్లు కలిపితే రూ.వందకోట్లు. అందరికంటే ఎక్కువగా ప్రాజెక్ట్ కే సినిమాకి దీపికా రూ.18 కోట్లు తీసుకుందట. దేవర మూవీకి జాన్వీ రూ.8 కోట్లు తీసుకుంటే, విలన్ రోల్ కోసం సైఫ్ ఆలీ ఖాన్ రూ.14 నుంచి రూ.16 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక హాయ్ నాన్నలో మెరిసేందుకు మృణాల్ ఠాకూర్ రూ.3 నుంచి రూ.4 కోట్లు, డబుల్ ఇస్మార్ట్ శంకర్‌లో విలన్ రోల్‌కి సంజయ్ దత్ రూ.10 కోట్లు, పవన్ ఓజీ మూవీలో విలన్ రోల్‌కి ఇమ్రాన్ హష్మీ రూ.16 కోట్లు తీసుకుంటున్నారు.
ఇక పవన్ మరో మూవీ హరి హర వీరమల్లులో విలన్ రోల్ వేస్తున్న బాబీ డీయోల్ ఏకంగా రూ.17 కోట్లు పారితోషికంగా తీసుుంటున్నాడట. వెంకటేష్‌తో శైలేష్ కొలను తీస్తున్న సైంధవ్‌లో విలన్ గా చేస్తున్నందుకు నవాజుద్దీన్ సిద్దీఖీ రూ.15 కోట్లు తీసుకుంటున్నాడు. ఇలా విలన్లు, హీరోయిన్ల పాత్రలు చేస్తూ పదిమంది వరకు బాలీవుడ్ స్టార్స్ రూ.100 కోట్లు మనదగ్గర నుంచి వసూలు చేస్తున్నారు.