PRABHAS: ఖాన్స్‌ను ఇంకా భయపెడుతున్న ప్రభాస్.. ఆ రికార్డు కొట్టలేరా..?
షారుక్ జవాన్, పటాన్ రెండు సినిమాలు చెరో 1000 కోట్లు పైనే వసూళ్లు రాబట్టాయి. కానీ ఈ రెండు కలిపినా బాహుబలి 2 సాధించిన 2200 కోట్ల రికార్డుని రీచ్ అవలేకపోయాయి. ఇక దంగల్ ఇండియా రికార్డులు బాహుబలి ముందు పనికిరావని తేలింది.
PRABHAS: రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో ఒక రికార్డు బాలీవుడ్‌నే భయపెడుతోంది. ఎప్పుడో వచ్చిన బాహుబలి 2 మూవీ ఇప్పటికీ బాలీవుడ్ హీరోలని నిద్ర లేకుండా చేస్తోంది. ఖాన్లు, కపూర్లు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రభాస్‌ని రీచ్ అవటం లేదు. కనీసం తన రికార్డులను టచ్ కూడా చేయలేకపోతున్నారు. షారుక్ జవాన్, పటాన్ రెండు సినిమాలు చెరో 1000 కోట్లు పైనే వసూళ్లు రాబట్టాయి. కానీ ఈ రెండు కలిపినా బాహుబలి 2 సాధించిన 2200 కోట్ల రికార్డుని రీచ్ అవలేకపోయాయి.
PAWAN KALYAN: OG సెన్సేషన్.. ఏకంగా అన్ని భాషల్లో రిలీజ్.. మరో ఖుషి అవుతుందా..?
ఇక దంగల్ ఇండియా రికార్డులు బాహుబలి ముందు పనికిరావని తేలింది. చైనా వసూళ్లను కలుపుకొంటే 2100 కోట్లు వచ్చాయి. కాబట్టి కాస్త బాహబలి ని రీచ్ అయ్యే ప్రయత్నం చేసింది దంగల్. అది కూడా ఇండియా, చైనా రిలీజ్ డేట్ మధ్య వ్యత్యాసం వల్లే సాధ్యమైంది. ఇక మరో ఖాన్ సల్మాన్ అయితే ప్రభాస్‌లో తను పదకొండో వంతని తేలింది. తన హిట్ మూవీలు పదకొండు కలిపితే ఒక్క బాహుబలి 2 కి సమానం అన్న పోలికే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. రంజాన్ స్పెషల్ గా 11 ఏల్లు గా వచ్చిన సల్మాన్ సినిమాలను కలిపితే ఒక్క బాహుబలి 2 అనంటున్నారు. 2009 లో వచ్చి వాంటెడ్ 64 కోట్లు రాబడితే, దబాంగ్ 143 కోట్లు, బాడీగార్డ్ రూ.142 కోట్లు, ఏక్ థా టైగర్ 198 కోట్లు, కిక్ 233 కోట్లు రాబట్టాయి.
భజరంగీ భాయ్‌జాన్, సుల్తాన్, రేస్ 3, ట్యూబ్ లైట్, భారత్, కిసీకా భాయ్ కిసీకా జాన్, ఇవన్నీ కలెక్ట్ చేసిన వసూళ్లు కలిపినా భాహుబలి 2 వసూళ్లని రీచ్ కాలేకపోతున్నాయి. ఇలా ముగ్గురు ఖాన్ల సినిమాలతో ఒక్క బాహుబలి 2 పోలిక నార్త్‌లో కూడా హాట్ టాపిక్ అయ్యింది. ప్రభాస్ రేంజ్ ఏంటో ఖాన్స్ అండ్ కపూర్స్‌కి అర్ధమైనట్టుంది.