బాలీవుడ్ బాద్ షా గా… టాలీవుడ్ బాద్ షా..?
మెగా స్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు నెక్ట్స్ మెగా స్టార్ ఎవరనే డిస్కర్షన్ జరిగింది. ప్రభాస్, మహేశ్ పేర్లు వినిపించాయి. పవన్ పాలిటిక్స్ లోబిజీ కాగానే తన ప్లేస్ ని రిప్లేస్ చేసేదెవరన్నారు.

మెగా స్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు నెక్ట్స్ మెగా స్టార్ ఎవరనే డిస్కర్షన్ జరిగింది. ప్రభాస్, మహేశ్ పేర్లు వినిపించాయి. పవన్ పాలిటిక్స్ లోబిజీ కాగానే తన ప్లేస్ ని రిప్లేస్ చేసేదెవరన్నారు. తర్వాత చిరు యూటర్న్ తీసుకున్నాడు. పవన్ ప్యార్ లల్ గా సినిమాలు, రాజకీయ ప్రయాణాలు చేస్తున్నాడు. సో ఎక్కడైనా ఇండస్ట్రీలో టాప్ స్టార్ ప్లేస్ ఖాలీ అయితే, మిగతా వాళ్ల కన్నుపడటం కామన్. మిగతావాళ్లలో ఎవరా ప్లేస్ ని రిప్లేజ్ చేస్తారనే చర్చ కూడా కామన్. అలా ఇప్పుడు బాలీవుడ్ నెంబర్ వన్ చైర్ ఖాలీగా ఉంది. ఖాన్లూ చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. కపూర్లకు హిట్ మెట్టెక్కడగమే గగనమైంది. అందుకే అక్కడ నెంబర్ వన్ ప్లేస్ లో జెండా పాతేది ఇద్దరు పాన్ ఇండియా కింగ్స్ అంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ఈ ఇద్దరి మీదే బాలీవుడ్ లో చర్చ మొదలైంది.ఈ డిస్కర్షన్ లో కనీసం ఖాన్లు, కపూర్లు కూడా లేకపోవటం విచిత్రం.. అదేంటో చూసేయండి.
బాలీవుడ్ ఓ మునిగిన షిప్పులా తయారైంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే అంతా బాలివుడ్డే… సౌత్ సినిమాను వాళ్లే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఎవరూ పట్టించుకుంది లేదు. అసలు బాహుబలి 1, బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో కెక్కినప్పుడు, అంతా అది బాలీవుడ్ మూవీనే అన్నారు. విదేశీ మీడియాకకు కూడా ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే…అలాంటిది అమెరికా, యూరప్, దేశాలకు కూడా టాలీవుడ్ ని పరిచయం చేశాయి, వరుస పాన్ ఇండియా హిట్లు… బాలీవుడ్ పదేళ్లుగా ఏ మూవీ తీసినా 99 వరకు అన్నీ ఫ్లాపులే ఏడాదికో హిట్టో, రెండు హిట్లు రావటమే గగనమైపోతోంది. అందుకే అక్కడ ఖాన్లు, కపూర్లు ఔట్ డేట్ అయ్యే పరిస్థితి ఫేస్ చేశారు. షారుఖ్ ఖాన్ ఏదో అతి కష్టంగా పటాన్, జవాన్ తో రెండు సార్లు వెయ్యికోట్లు రాబట్టొచ్చు..కాని తనకి షష్టిపూర్తి ఏజ్ వచ్చేసింది.
ఆమిర్ ఖాన్ ఆల్రెడీ అన్ అఫీషియల్ గా రిటైర్ అయినట్టే ప్రవర్తిస్తున్నాడు. అక్షయ్ కుమార్ పదేళ్లలో కనీసం 30 డిజాస్టర్లు ఫేస్ చేశాడు. అజయ్ దేవ్ గన్ పరిస్తితి అంటే, రణ్ వీర్ సింగ్ అడ్రస్ లేదు… రణ్ బీర్ కపూర్ ఏదో యానిమల్ పుణ్యమాని ఇంకా లైమ్ లైట్ లో ఉన్నాడు. లేదంటే తను మూలకు పడిపోయే పరిస్థితి..ఇలాంటి టైంలో అసలు బాలీవుడ్ నెంబర్ వన్ ఎవరు, ఆ చైర్లో కూర్చునే అసలైన బాద్ షా ఎవరనే చర్చ మొదలైంది. మొన్నటి వరకు షారుఖ్ ఖాన్ లాంటి బాద్ షా ఉన్నాక, తన చైర్లో ఇంకొక్కరికి ఛాన్సేలేదన్నారు. కాని టాలీవుడ్ బాద్ షా ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఇద్దరు బాలీవుడ్ నెంబర్ 1. చైర్లో కూర్చునేలా ఉన్నారు. వరుసగా చెరో పావుడజన్ మూవీలతో దాడి చేయబోతున్నారు. ఆల్రెడీ హిట్ కి, ఫ్టాప్ కి అతీతుడు అనేలా ప్రభాస్ చేసిన యావరేజ్ మూవీ కూడా 300 కోట్ల నుంచి 800 కోట్ల వరకు రాబడితే, హిట్ మూవీలు `1200 కోట్ల పైనే రాబడుతున్నాయి.
ఎన్టీఆర్ కైతే సౌత్ తో పోలిస్తే, నార్త్ ఇండియాలోనే ఊర మాస్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అసలు దేవర 670 కోట్లలో 300 నుంచి 400 కోట్లు అక్కడ నుంచే వచ్చాయనేంతగా తనకి, నార్త్ లో మార్కెట్ ఉంది. దీనికి తోడు రాజమౌలి సాయం లేకుండా సోలోగా పాన్ ఇండియాని షేక్ చేశాడు. కాబట్టే ఈ టాలీవుడ్ బాద్ షా బాలీవుడ్ బాద్ షా చైర్ కే ఎసరు పెట్టేలా ఉన్నాడు. మన వాళ్లెందుకు బాలీవుడ్ నెం.1 చైర్లో కూర్చుంటారు, అదెలా సాధ్యమనే డిస్కర్షనే అవసరం లేదు. ఒకప్పడు మన సినిమా నార్త్ లో ఆడుతుందా కాదు, రిలీజ్ అవుతుందా అంటేఎవరూ నమ్మలేదు. కాని తెలుగు సినిమానే ఇండియన్ సినిమాని శాసిస్తోందిప్పుడు… కాబట్టి అన్నీ సాధ్యమే…