SALAAR: సలార్ దెబ్బకు బుక్ మై షో సైట్ క్రాష్.. ఇది కదా ప్రభాస్ రేంజ్..

బెన్‌ఫిట్ షోస్, స్పెషల్ షోస్, టికెట్ రేట్స్ పెంపు అనుమతి కోసం నిర్మాతలు రెండు ప్రభుత్వాలకి అప్లై చేసుకున్నారు. ఇక నిన్నసాయంత్రం రెండు ప్రభుత్వాల నుంచి పర్మిషన్ వచ్చాక.. బుక్ మై షోలో బుకింగ్స్ ఓపెన్ చేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 20, 2023 | 04:00 PMLast Updated on: Dec 20, 2023 | 4:00 PM

Bookmyshow Site Crashed Due To Fans Of Salaar Movie

SALAAR: ఇటీవలి కాలంలో డార్లింగ్ ప్రభాస్ ఏ సినిమాకు రాని పిచ్చ క్రేజ్ సలార్ సినిమాకి వస్తోంది. తమ అభిమాన నటుడిని ఎలా చూడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారో.. అలానే ప్రభాస్ కనిపిస్తుండటంతో హంగామా మామూలు రేంజ్లో లేదు. ఇదిలా ఉంచితే.. సలార్ సినిమా మరో రెండ్రోజుల్లో రిలీజ్ అవుతుండటంతో టికెట్ల పోరాటం నడుస్తోంది. రిలీజ్కు ఐదు రోజుల ముందే హిందీ, కన్నడ, తమిళ భాషలలో సలార్ సినిమాకి బుక్మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ షురూ అయ్యాయి.

Bigg Boss Season 7 Winner : బిగ్‌బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ మిస్సింగ్‌.. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌..

కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నిన్నటి వరకి ఓపెన్ కాలేదు. ఇందుకు కారణం లేకపోలేదు. బెన్‌ఫిట్ షోస్, స్పెషల్ షోస్, టికెట్ రేట్స్ పెంపు అనుమతి కోసం నిర్మాతలు రెండు ప్రభుత్వాలకి అప్లై చేసుకున్నారు. ఇక నిన్నసాయంత్రం రెండు ప్రభుత్వాల నుంచి పర్మిషన్ వచ్చాక.. బుక్ మై షోలో బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇక టికెట్ల కోసం ఆకలిమీదున్న ఫ్యాన్స్ ఒక్కసారిగా బుక్ మై షో ఓపెన్ అవ్వగానే టికెట్లు బుక్ చేసుకోవడానికి పోటీ పడ్డారు. దీంతో లక్షలాది మంది ఒకేసారి సైట్ ఓపెన్ చేయడంతో బుక్ మై షో యాప్ సైతం క్రాష్ అయ్యింది. ఇది కదా సలారోడి దెబ్బ అని ఫీలవుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.

సైట్ క్రాష్ అవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ అయినప్పటికీ..బ సలార్ సినిమాకు పెరుగుతోన్న ఆదరణకు ఫిదా అయ్యారు. ప్రస్తుతం బుక్మై షోలో అన్ని షోస్ పూర్తిగా ఫిల్ అయ్యాయి. అయితే, ఈ సినిమాకు ఉన్న డిమాండ్ కారణంగా.. కావాలనే సర్వర్ డౌన్ చేశారా? లేదంటే నిజంగా క్రాష్ అయ్యిందా అని ఆలోచనలో పడ్డారు నెటిజన్స్. ఇది పబ్లిసిటీ స్టంట్ కాదని బుక్మై షో వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూల్ అయ్యారని సమాచారం.