సౌత్ లో బోరింగ్ కాని నార్త్ లో 66 కోట్లు.. దేవర, కల్కీ తర్వాత తనకే..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప2 చూసేందుకొచ్చి భార్యని కోల్పోయిన ఓ వ్యక్తికి, 25 లక్షల పరిహరం ప్రకటించాడు బన్నీ. నిజానికి హాస్పిటల్ లో ఉన్న అబ్బాయి ఖర్చులన్నీ తామే భరిస్తామని పుష్ప2 టీం ప్రకటించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 7, 2024 | 08:59 PMLast Updated on: Dec 07, 2024 | 8:59 PM

Boring In The South But 66 Crores In The North After Deora And Kalki Its Hers

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప2 చూసేందుకొచ్చి భార్యని కోల్పోయిన ఓ వ్యక్తికి, 25 లక్షల పరిహరం ప్రకటించాడు బన్నీ. నిజానికి హాస్పిటల్ లో ఉన్న అబ్బాయి ఖర్చులన్నీ తామే భరిస్తామని పుష్ప2 టీం ప్రకటించింది. బన్నీనే ఆ మాట వీడియో బైట్ లోచెప్పాడు.. నిజానికి ఇది మెచ్చుకోవాల్సిన అంశమే.. కాని ఇది భారీగా ట్రోలింగ్ కి కారణమైంది. అసలు ఎక్స్ గ్రేషియా ప్రకటించకున్నా, ఇంతగా ట్రోలింగ్ జరిగేది కాదేమో. కాని బన్నీ ఇచ్చిన స్టేట్ మెంట్లను పార్టులు పార్టులుగా విడగొట్టి, ట్రోలింగ్ తో పోస్ట్ మార్టమ్ చేస్తున్నారు ట్రోలర్స్.. బన్నీ చెప్పేవన్నీ అబద్దాలే అంటున్నారు.. అంతగా ఆ వీడియో ఎందుకు ట్రోలింగ్ కి గురైందోచూసేయండి.

పుష్ప 2 ప్రివ్యూ టాక్ హిట్.. ఫస్ట్ డే రెండు షోలకే అదే టాక్ రివర్స్ అయ్యింది. ప్లాప్ అనేస్తున్నారు. రెండో రోజుకే విచిత్రంగా ఈ సినిమా వసూల్లు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు డ్రాప్ అయ్యాయి. కోలీవుడ్ లోకూడా పుష్ప2 కి వసూళ్ల జోరు తగ్గింది. కన్నడ, మలయాళం మార్కెట్లలో కూడా పుష్ప2 కి రెండో రోజు వసూళ్లు ఊహించనంతగా డ్రాప్ అయ్యాయి

కాని విచిత్రంగా హిందీలో మాత్రం పుష్ప2కి కాలం కలిసొచ్చింది. నిజానికి నార్త్ ఇండియాలో సినిమా ఆడాలంటే, ఐదారు ఫైట్లు, అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇబ్బంది కలిగించని సీన్లు, నచ్చేలా పాటలు ఇవుంటే చాలు. ఈజీగా నార్త్ లో సినిమా ఆడేస్తుంది… ఏమాత్రం కంటెంట్ బాగున్నా ఇక కనకవర్షమే… అదే పుష్ప2 విషయంలో నిజమైనట్టుంది.

ఉత్తారాదినపుష్ప 2 ఓపెనింగ్స్ షాక్ ఇస్తున్నాయి. 66 కోట్ల భారీ వసూళ్లని హిందీ బెల్ట్ లో సొంతం చేసుకుంది పుష్ప2 మూవీ. ఈ విషయంలో చాలా వరకు హిందీ హిట్ మూవీలని వెనక్కి నెట్టాడు పుష్పారాజ్

షారుఖ్ ఖాన్ మూవీ జవాన్ మొదటి రోజు 65 కోట్లు రాబడితే, మరో మూవీ పటాన్ 55 కోట్లు రాబట్టింది. ఇక హిందీ మూవీ స్త్రీ 2 కి మొదటి రోజు 64 కోట్లు వస్తే, యానిమల్ సినిమాకు 54 కోట్ల ఓపెనింగ్స్ వచ్చాయి.

సో వీటన్నీంటితో పోలిస్తే పుష్ప2 కి 66 కోట్ల ఓపెనింగ్స్ అంటే, హిందీ మార్కెట్ లో పుష్పరాజ్ నిజంగా దుమ్ముదులిపినట్టే… సౌత్ లో దేవర, కల్కీ రికార్డులని టచ్ చేయలేకపోయిన పుష్ప 2 మూవీ ఓపెనింగ్స్, ఓవర్ సీస్ లో కూడా వెనకబడింది.

కాని హిందీ మార్కెట్ లో మాత్రం పుష్ప 2 కి ఊహించని స్థాయిలో భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. జవాన్, స్త్రీ, యానిమల్, పటానే కాదు, బాహుబలి 2 తాలూకు 41 కోట్ల హిందీ మార్కెట్ ఓపెనింగ్స్ ని కూడా పుష్ప2 ఓపెనింగ్స్ దాటేశాయి. త్రిబుల్ ఆర్, ఆదిపురుష్ తాలూకు హిందీ ఓపెనింగ్స్ ని కూడా పుష్ప2 ఓపెనింగ్స్ దాటేశాయి.. సో సినిమా రిలీజైన రెండో రోజు సౌత్ లో టాక్ రివర్స్ అవటంతో డీలా పడ్డ పుష్ప 2 టీం కి, నార్త్ ఇండియా వసూళ్లు మాత్రం కాస్త ఎంకరేజింగ్ గా ఉన్నాయి. కాని ఇవన్నీ రియల్ వసూళ్లేనా, కార్పోరేట్ బుక్కింగ్సా అంటూ మరో కాన్సిపిరసీ థియరీ వినిపిస్తోంది.