Annapurnamma, Singer, Chinnai : ఇండియాలో పుట్టడం ఖర్మ.. సింగర్ చిన్మయిపై పోలీస్ కేసు

నోటికి ఎంత వస్తే... అంత మాట్లాడేయటం కొందరు సెలబ్రిటీలకు ఫ్యాషన్ అయింది. తీరా మాట్లాడిన తర్వాత వైరల్ అయితే... నా మాటలు వక్రీకరించారనడం కామన్. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ చిన్మయి శ్రీపాద కూడా వివాదస్పద కామెంట్స్ చేయడంతో పోలీస్ కేసు నమోదైంది. ఇండియా స్టుపిడ్ కంట్రీ అంటూ... ఇక్కడ ఆడపిల్లగా జీవించడం మా కర్మ అంటూ కామెంట్ చేయడంపై గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 29, 2024 | 03:29 PMLast Updated on: Feb 29, 2024 | 3:29 PM

Born In India Is Fate Police Case Against Singer Chinmai

 

 

 

నోటికి ఎంత వస్తే… అంత మాట్లాడేయటం కొందరు సెలబ్రిటీలకు ఫ్యాషన్ అయింది. తీరా మాట్లాడిన తర్వాత వైరల్ అయితే… నా మాటలు వక్రీకరించారనడం కామన్. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్, సింగర్ చిన్మయి శ్రీపాద కూడా వివాదస్పద కామెంట్స్ చేయడంతో పోలీస్ కేసు నమోదైంది. ఇండియా స్టుపిడ్ కంట్రీ అంటూ… ఇక్కడ ఆడపిల్లగా జీవించడం మా కర్మ అంటూ కామెంట్ చేయడంపై గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి కుమార్ సాగర్ ఈ కంప్లయింట్ ఇచ్చారు. మహిళలు బట్టల విషయంలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ…చిన్మయి ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది.

భారత్ ను స్టుపిడ్ కంట్రీ అంటూ… ఈ దేశంలో పుట్టడం నా ఖర్మ అని చిన్మయి అనడంపై… వారం, పది రోజులుగా నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. చిన్మయికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. వాళ్ళల్లో కొందరిని బ్లాక్ చేస్తోంది చిన్మయి. నటి అన్నపూర్ణమ్మ కి ఏమైనా చెప్పాలనుకుంటే.. ఆమెనుద్దేశించి డైరెక్ట్ గా చెప్పొచ్చు… ఇండియాను తక్కువ చేసి మాట్లాడటం ఏంటని చిన్మయిపై పోలీస్ కేసు పెట్టారు. భారత్ లో ఉంటూ… ఇక్కడి సొమ్ముతో ఎంజాయ్ చేస్తూ… ఇక్కడ పుట్టడం ఖర్మ అనడం… పైగా చెత్త దేశం అని కామెంట్ చేయడాన్ని తప్పుబడుతున్నారు నెటిజెన్స్.

సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆ రోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా.. ఆడదానికి స్వాతంత్య్రం ఎందుకు కావాలి. అర్థరాత్రి 12 తర్వాత బయట ఏం పని. ఇప్పుడు ఎక్స్‌పోజింగ్ ఎక్కువైంది… అందరూ ఏదో ఒకటి అనేలాగా ఎందుకు రెడీ అవ్వాలని ప్రశ్నించారు. ఎదుటి వాళ్లది తప్పు అనడం కాదు… మనవైపూ లేకుండా చూసుకోవాలని అన్నపూర్ణమ్మ కామెంట్ చేశారు. ఈ వీడియోని ఇన్‌స్ట్రాగ్రామ్ లో షేర్ చేస్తూ చిన్మయి దేశం మీద కూడా కామెంట్స్ చేసింది.

అన్నపూర్ణమ్మ చెప్పినట్టు నడిస్తే… అర్ధరాత్రి హాస్పిటల్స్ ఉండవ్. అందులో డాక్టర్స్ ఉండరు. వాళ్ళంతా అమ్మాయిలే కాబట్టి అర్ధరాత్రి ఇంట్లోనే ఉంటారు అన్నది చిన్మయి. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, యాక్సిడెంట్ అయినా సూర్యోదయం, సూర్యాస్తమయానికి మధ్యలోనే జరగాలనీ… ఘాటుగా స్పందించింది. అమ్మాయిల వేషధారణ వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని అనుకునే వాళ్ళు బతుకుతున్న ఇండియాలో… ఆడపిల్లలుగా పుట్టడం మన ఖర్మ అంటూ భారత దేశంపైనా కఠినంగా మాట్లాడింది చిన్మయి. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో HCU స్టూడెంట్ కేసు పెట్టారు.