Prabhas: ఒక్క ఈవెంట్ లో.. ప్రభాస్ తాలూకు ఎన్నో వండర్స్..
అమెరికాలో కార్టూన్ మ్యాగజీన్లు, కామిక్ నావెల్స్ సంబంధించిన ఈవెంట్ అయిన కామిక్ కాన్ లో ప్రాజెక్ట్ కే సందడి పెరిగింది. గ్లింప్స్ కి ముందు ఫిల్మ్ టీం వదిలినా ప్రభాస్ లుక్ షాక్ ఇచ్చింది. ఇక రైడర్స్ పేరుతో విలన్ తాలూకు ఆర్మీ కాస్ట్యూమ్స్ లో కనిపించిన మోడల్స్ కూడా ప్రాజెక్ట్ కే ఫస్ట్ ఇండియాన్ సూపర్ హీరో మూవీగా ఫోకస్ అయ్యేలా చేస్తోంది.

Both Prabhas and Rana appeared in a special role in the photos released at the American Commit show
అవెంజర్స్ లో హీరోల గెటప్ లా ప్రభాస్ లుక్ ఉండటం, థోర్ లా తన హేయిర్ స్టైల్ ఉండటంతో అంతా షాక్ అవుతున్నారు. ఐతే లుక్ మీద మిక్స్ డ్ టాక్ కూడా వస్తోంది. ఏదేలా ఉన్నా ఒక్క ఈవెంట్ ఎన్నో సర్ ప్రైజ్ లకు కారణమౌతోంది. ఒకటి ప్రాజెక్ట్ కే సినిమా రూపంలోనే కాదు కామిక్ రూపంలో కూడా రాబోతుండటం, మరొక సర్ ప్రైజ్ ఏంటంటే, రానా హిరణ్య కశ్యప కూడా కామిక్ రూపంలో రాబోతుండట. ఇలా రెండు తెలుగు సినిమాలు వరల్డ్ ప్లాట్ ఫాంలో కార్టూన్ బొమ్మల రూపంలో కూడా అందుబాటులోకి రాబోతుండటం.
ఇదేనా మలయాళం లో వచ్చిన మున్నార్ మురళి లాంటి హిట్ మూవీ కూడా కార్టూన్ నవల రూపంలోరాబోతోంది. ఇలా మూడు భారతీయ సినిమాలు అమెరికన్స్ తోపాట వరల్డ్ వైడ్ గా చిన్నారులకు కామిక్ రూపంలో అందుబాటులో ఉండబోతోంది. ఇక హిరణ్య కశ్యప మూవీకి త్రివిక్రమ్ కథ రాస్తే, రానా హీరోగా తెరకెక్కబోతుండటం, ఈ ప్రాజెక్ట్ కి ప్రభాస్ వాయిస్ ఓవర్ తోపాటు నటించటం లాంటి సాయం చేయటం హాట్ టాపిక్ అయ్యాయి. మొత్తానికి కామిక్ కాన్ ఈవెంట్ ఈ వారం టాక్ ఆఫ్ ద సినీ వల్డ్ గా మారింది.