NANDAMURI BALAKRISHNA-NTR: నందమూరి వార్.. బాబాయ్ అబ్బాయ్ మధ్య బాక్సాఫీస్ పోరు..!
నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య అనుబంధం సంగతి ఎలా ఉన్నా.. అభిమానులు మాత్రం సినిమాల విషయంలో ఐక్యంగా ఉంటారు. సాధ్యమైనంత వరకు బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ వర్సెస్ ఎన్టీఆర్ సినిమాలు ఒకేసారి ఎప్పుడు కూడా పోటీ పడకూడదని కోరుకుంటారు.

Jr-NTR-Nandamuri-Balakrishna
NANDAMURI BALAKRISHNA-NTR: బాబాయ్, అబ్బాయ్ ఎప్పుడెప్పుడు కలుస్తారా అని అభిమానులు ఎదురుచూస్తోంటే.. సినిమాలేమో వారి మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. కలవకపోయినా కనీసం గొడవల్లేవులే అని తృప్తిపడదామంటే.. వచ్చే వేసవి వారి మధ్య పెద్ద చిచ్చే పెట్టబోతోంది. బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పేలా లేదు. నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య అనుబంధం సంగతి ఎలా ఉన్నా.. అభిమానులు మాత్రం సినిమాల విషయంలో ఐక్యంగా ఉంటారు.
Salaar Trailer: కొత్త టెన్షన్.. సలార్ ట్రైలర్‌పై షాకింగ్ ట్విస్ట్..
సాధ్యమైనంత వరకు బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ వర్సెస్ ఎన్టీఆర్ సినిమాలు ఒకేసారి ఎప్పుడు కూడా పోటీ పడకూడదని కోరుకుంటారు. ఇప్పటి వరకు అలాంటి పరిస్థితులు పెద్దగా రాలేదు. ఒకే ఒక్కసారి గతంలో 2016 సంక్రాంతికి అనివార్య పరిస్థితుల్లో బాలయ్య డిక్టేటర్, తారక్.. నాన్నకు ప్రేమతో సినిమాలను ఒక్క రోజు గ్యాప్‌లతో రిలీజ్ చేయగా.. నందమూరి అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి గొడవ పడటం కనిపించింది. దీంతో మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదని బలంగా కోరుకుంటుంటారు అభిమానులు. కానీ ఇప్పుడు బాబాయ్, అబ్బాయ్ మధ్య భీకర పోరు తప్పేలా లేదు. భగవంత్ కేసరితో వరసగా మూడో విజయం అందుకున్న బాలయ్య.. నెక్స్ట్ ప్రాజెక్టును బాబీ దర్శకత్వంలో మొదలుపెట్టాడు. అయితే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. ఈ సినిమాను ఆరు నెలలలోపే పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు కూడా. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. రానున్న మార్చ్ 29న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఒకవేళ అదే జరిగితే.. బాలయ్య, ఎన్టీఆర్‌తో పోటీ పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ చేస్తున్న దేవర మొదటి భాగం ఏప్రిల్ 5నే విడుదల కానుంది. రిలీజ్ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని.. తాజాగా 150 రోజుల కౌంట్‌డౌన్ పోస్టర్‌తో దేవర టీం క్లారిటీ ఇచ్చింది. ఇదే నిజమైతే వారం వ్యవధిలో బాబాయ్-అబ్బాయ్ సినిమాలు రిలీజై నందమూరి అభిమానుల్లో మరోసారి కలకలం రేపడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో.