హిమాలయాల్లో బోయపాటి.. అయ్య బాబోయ్ అక్కడేం చేస్తున్నాడు.. అంటే అప్పుడే..!

ఎవరికైనా ముందు సినిమా ఫ్లాప్ అయితే.. కాస్త భయపడతారు.. బడ్జెట్ పెట్టించడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ బోయపాటి శ్రీను మాత్రం అలా కాదు.. ముందు సినిమా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా తర్వాత సినిమాకు అదిరిపోయే బడ్జెట్ పెడుతుంటాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 3, 2025 | 03:45 PMLast Updated on: Mar 03, 2025 | 3:45 PM

Boyapati In The Himalayas Ayah Baboy Is Doing It There I Mean Just Now

ఎవరికైనా ముందు సినిమా ఫ్లాప్ అయితే.. కాస్త భయపడతారు.. బడ్జెట్ పెట్టించడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కానీ బోయపాటి శ్రీను మాత్రం అలా కాదు.. ముందు సినిమా హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా తర్వాత సినిమాకు అదిరిపోయే బడ్జెట్ పెడుతుంటాడు. నిర్మాతలు కూడా ఈయన మీద నమ్మకంతో ఎంత అడిగితే అంత ఇస్తుంటారు. ఇప్పుడు అఖండ సీక్వెల్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. పైగా బాలకృష్ణ హీరో కావడంతో నిర్మాతలకు అసలు భయమే లేదు.. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో అఖండ 2 కోసం అడిగినంత కాదు.. అంతకుమించి బడ్జెట్ ఇస్తున్నారు. పైగా ఈ సినిమా నిర్మాతలలో బాలకృష్ణ కూతురు కూడా ఉంది.

తేజస్విని నందమూరి ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. నిజానికి అఖండ తర్వాత బాలయ్య బాగోగులు, కెరీర్ బాధ్యతలు మొత్తం పేజీశ్రీ తీసుకుంది. అందుకే అప్పటి నుంచి బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమాలు అన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఎక్కడా తన తండ్రి టోల్ కాకుండా కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది తేజస్విని. ఇక ఇప్పుడు అఖండ 2 కోసం ఇంకా ఎక్కువ కేరింగ్ తీసుకుంటున్నారు మేకర్స్. ఈ సినిమా కోసం ఇండియా మొత్తం తిరుగుతున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం బోయపాటి శ్రీను ఇదే పని మీద హిమాలయాల్లో ఉన్నాడు. అక్కడ లొకేషన్స్ కోసం రెక్కి జరుగుతుంది. ఈ సినిమా మేజర్ షెడ్యూల్ ఒకటి హిమాలయాల పరిసర ప్రాంతాల్లోనే ప్లాన్ చేస్తున్నాడు.

ఆఖండ 2 కోసం నార్త్ ఆడియన్స్ ను బాగా టార్గెట్ చేస్తున్నాడు బోయపాటి. ఈ మధ్య మహా కుంభమేళాలో అదిరిపోయే ఇంటర్వెల్ బ్లాక్ షూట్ చేశాడు. దానికి తోడు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఈ సినిమాను ఉత్తరాది ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నాడు బోయపాటి. పైగా శివుడి సెంటిమెంట్ కాబట్టి కచ్చితంగా ప్యాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ వస్తుందని నమ్ముతున్నారు. అఖండలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ అయితే.. సెకండ్ పార్ట్ కోసం సంయుక్త మీనన్ వచ్చింది. సెప్టెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం దాదాపు 130 కోట్లు ఖర్చు పెడుతున్నారు.