BOYAPATI SRINU: గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో బోయపాటి.. హీరో ఎవరు..?

స్కంద డిజాస్టర్‌ కావడంతో.. బోయపాటి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ డైలమాలో పడింది. హీరోలెవ్వరూ ఖాళీగా లేరు. బోయపాటి గ్యాప్‌లో పడిపోతాడనుకున్నారు. అయితే.. ఎలాంటి హడావిడి లేకుండా సడెన్‌గా గీతా ఆర్ట్స్‌.. బోయపాటి డైరెక్షన్‌లో సినిమా ఎనౌన్స్‌ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 31, 2024 | 01:06 PMLast Updated on: Jan 31, 2024 | 1:06 PM

Boyapati Srinu And Geetha Arts Combo Movie Hero Not Confirmed Yet

BOYAPATI SRINU: గీతా ఆర్ట్స్‌ బేనర్‌లో బోయపాటి డైరెక్షన్‌లో సినిమా ప్రకటించారు. కానీ.. హీరో ఎవరో చెప్పలేదు. డైరెక్టర్‌ను మాత్రమే ప్రకటించి సస్పెన్స్‌లో పెట్టాడు నిర్మాత. అయితే ఆఫ్‌ ది రికార్డ్‌ లో బన్నీ.. బాలకృష్ణ .. సూర్య పేర్లు వినిపిస్తున్నాయి. మరి బోయపాటి డైరెక్షన్‌లో నటించే హీరో ఎవరు అన్న దానిపై ఇండస్ట్రీలో డిస్కషన్ నడుస్తోంది. స్కంద డిజాస్టర్‌ కావడంతో.. బోయపాటి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ డైలమాలో పడింది. హీరోలెవ్వరూ ఖాళీగా లేరు. బోయపాటి గ్యాప్‌లో పడిపోతాడనుకున్నారు. అయితే.. ఎలాంటి హడావిడి లేకుండా సడెన్‌గా గీతా ఆర్ట్స్‌.. బోయపాటి డైరెక్షన్‌లో సినిమా ఎనౌన్స్‌ చేసింది. హీరో ఎవరో చెప్పకుండా సస్పెన్స్‌లో వుంచింది.

AYODHYA TO TIRUMALA: బాల రాముడికి వెంకన్న సాయం.. తిరుమల రద్దీపై అయోధ్య ట్రస్ట్ స్టడీ

స్కంద రిలీజ్‌ కంటే ముందు బోయపాటి ముగ్గురు హీరోలను లైన్లో పెట్టాడు. బాలయ్యతో అఖండ 2 ఎలాగూ వుంది. సరైనోడు లాంటి సూపర్‌హిట్‌ తర్వాత బోయపాటి డైరెక్షన్‌లో నటించడానికి బన్నీ ఇంట్రెస్ట్‌ చూపించాడు. సూర్య పేరు కూడా వినిపించింది. ఈ ముగ్గురిలో ఎవర్ని బోయపాటి డైరెక్ట్ చేస్తాడో తేలాలి. అల్లు అరవింద్‌ చాలాకాలంగా బాలకృష్ణతో సినిమా తీయాలనుకుంటున్నాడు. అన్‌స్టాపబుల్‌లో ఏర్పడ్డ అనుబంధంతో కథ దొరికితే.. గీతా ఆర్ట్స్‌లో చేస్తానని బాలయ్య కూడా మాటిచ్చాడు. అల్లు శిరీశ్‌ హీరోగా నటించిన ఊర్వశివో.. రాక్షసివో ఈవెంట్‌కు బాలయ్య ముఖ్యఅతిథిగా వెళ్లాడు. ఇందులో పరశురామ్‌ మాట్లాడుతూ.. బాలకృష్ణ కోసం కథ రాస్తున్నానని చెప్పాడు. పరశురామ్‌ అనుకోకుండా.. దిల్‌ రాజు బేనర్‌లోకి వెళ్లిపోయి.. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్‌’ తీస్తున్నాడు. లేదంటే బాలయ్య, పరశురామ్‌ సినిమాను గీతా ఆర్ట్స్‌ నిర్మించాలి. మరి ఇదే బేనర్‌ బోయపాటి, బాలయ్య కాంబోలో అఖండ2ను తీస్తుందా..? అన్న డౌట్‌ వస్తోంది. ప్రస్తుతం బాబీ డైరెక్షన్‌లో నటిస్తున్న బాలకృష్ణ నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించలేదు.

గీతా ఆర్ట్స్‌ బేనర్‌లో నటించే మూవీనే నెక్ట్స్‌ మూవీ అవుతుందేమో చూడాలి. సరైనోడు కాంబోను గీతా ఆర్ట్స్ రిపీట్‌ చేస్తుందా అనే డిస్కషన్‌ కూడా నడుస్తోంది. పుష్ప 2 సెట్స్‌పై వుండగానే.. త్రివిక్రమ్‌, బన్నీ మూవీని ప్రకటించారు. అయితే.. గుంటూరుకారం తర్వాత త్రివిక్రమ్ మూవీ ఇప్పట్లో వుండదని.. ముందుగా అట్లీ మూవీ చేస్తాడన్న ప్రచారం నడుస్తోంది. అట్లీని కాదని బోయపాటికి ఇచ్చే ఛాన్స్‌ తక్కువే. ఇక సూర్య పేరు కొంతకాలంగా వినిపిస్తున్నా.. హీరో కమిటైన సినిమాలు పూర్తి కావాలంటే..రెండేళ్లు పడుతుంది. అప్పటిదాకా బోయపాటి వెయిట్ చేయలేడు. బన్నీ ఆల్రెడీ రెండు సినిమాలు కమిటయ్యాడు. ఈ లెక్కన బోయపాటి, గీతా ఆర్ట్స్ సినిమాలో బాలకృష్ణే హీరోలా కనిపిస్తున్నాడు. అది అఖండ 2 అవుతుందా? లేదంటే ఫ్రెష్‌ సబ్జెక్టో తెలియాల్సి వుంది.