‎Akhanda 2: త్వరలోనే అఖండ-2.. బాలయ్య-బోయపాటి మరో సక్సెస్ కొట్టేనా..?

దాదాపు రెండేళ్ల క్రితం వచ్చిన అఖండ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైనప్పుడే సీక్వెల్ గ్యారెంటీ అనే ప్రచారం జరిగింది. ఇప్పుడీ ప్రచారం నిజం కాబోతుంది. త్వరలోనే అఖండ సీక్వెల్‌గా అఖండ-2 రూపొందబోతున్నట్లు తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 1, 2023 | 08:53 PMLast Updated on: Oct 01, 2023 | 8:53 PM

Boyapati Srinu And Nandamuri Balakrishnas Akhanda Sequel Will Be Coming Soon

‎Akhanda 2: బాలకృష్ణ, బోయపాటి కాంబో అంటే సూపర్ హిట్ గ్యారెంటీ. ఈ ఇద్దరి కాంబోలో ఇదివరకు వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. అదే అఖండ-2. దాదాపు రెండేళ్ల క్రితం వచ్చిన అఖండ భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైనప్పుడే సీక్వెల్ గ్యారెంటీ అనే ప్రచారం జరిగింది. ఇప్పుడీ ప్రచారం నిజం కాబోతుంది. త్వరలోనే అఖండ సీక్వెల్‌గా అఖండ-2 రూపొందబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్ర కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని, ఇందులో సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ మూవీ కచ్చితంగా బాలయ్య కెరీర్‌లో మరో వినూత్న సినిమా అవ్వబోతుందని చిత్రవర్గాల నుంచి అందుతున్న సమాచారం. అలాగే బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్, పొలిటికల్ సెటైరికల్ పంచ్‌లు కూడా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తైంది. వచ్చే దసరాకు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత వాల్తేరు వీరయ్య ఫేం బాబీ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తారు. ఇది పూర్తయ్యాక బాలయ్య-బోయపాటిల ‘అఖండ 2’ సినిమా స్టార్ట్ అవుతుంది.

ఈ లోపు చిత్ర కథను అద్భుతంగా తీర్చిదిద్దడానికి బోయపాటి శీన్ టైం కేటాయించబోతున్నారు. ప్రేక్షకుల అంచనాలు అందుకునేలా ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించాలని బోయపాటి భావిస్తున్నారు. ఇటీవలే స్కంద మూవీతో వచ్చి, మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాడు బోయపాటి. ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. అందుకే బాలయ్య సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని బోయపాటి కసిగా ఉన్నారు.