Balakrshina : అఖండ2లో భూమిక
ఇక బాలకృష్ణ (Balakrishna) పనైపోయింది.. అని అనుకుంటున్న సమయంలో సింహా సినిమాతో సాలిడ్ హిట్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. బాలయ్యను కొత్త చూపించి బ్లాక్ బస్టర్ కొట్టాడు.

Boyapati Srinu gave a solid hit with the movie Simha when I thought that Balakrishna was gone.
ఇక బాలకృష్ణ (Balakrishna) పనైపోయింది.. అని అనుకుంటున్న సమయంలో సింహా సినిమాతో సాలిడ్ హిట్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. బాలయ్యను కొత్త చూపించి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత లెజెండ్, అఖండ సినిమాలతో బాలయ్యకు హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన బోయపాటి.. ఇప్పుడు అఖండ2 (Akhanda2) తో మరో హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Natasimham Balakrishna), బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత అఖండ 2 చేయడానికి రెడీ అవుతున్నారు..ఇప్పటికే అఖండ2 పనులతో బిజీగా ఉన్నాడు ఈ మాస్ డైరెక్టర్. అంతేకాదు. ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అఖండ సినిమాకు ప్రగ్యా గ్లామర్ మరింత కలిసొచ్చింది. దీంతో.. మరోసారి అమ్మడికి అఖండ2లో ఛాన్స్ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
కానీ మరో సీనియర్ హీరోయిన్‌కి మాత్రం ఛాన్స్ ఇస్తున్నట్టుగా సమాచారం. ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమికను అఖండ2 లో తీసుకున్నట్టుగా టాక్ నడుస్తోంది. హీరోయిన్‌గా దాదాపు తెలుగు స్టార్స్ అందరితో నటించింది భూమిక. అయితే.. సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తుంది. కానీ ఇప్పుడు బాలకృష్ణతో ఛాన్స్ అందుకుందని ఇండస్ట్రీ వర్గాల ఇన్‌సైడ్ టాక్. అయితే.. ఆమె బాలయ్యకు జంటగా నటిస్తుందా లేదా ముఖ్య పాత్రలో నటిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక.. ఈ సినిమాను బాలయ్య బర్త్ డే కానుకగా జూన్ 10న ఆరంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య అడ్డా హిందూపురంలోనే ఈ సినిమా మొదలు కానున్నట్టుగా వినిపిస్తుంది. దీని పై కూడా మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.