Boyapati Srinu: బోయపాటి శీను సూపర్ బిస్కెట్ వేసేశాడా..?
గతంలో తమిళ స్టార్ సూర్యకి కథ చెప్పి అక్కడ రిజెక్షన్‌ని ఫేస్ చేసిన బోయపాటి.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబుకు బిస్కెట్ వేసే పనిలో ఉన్నట్టున్నాడు. ఎలాగూ డిసెంబర్లో గుంటూరు కారం షూటింగ్ పూర్తవుతుంది.
Boyapati Srinu: నేనింతే మూవీలో డైరెక్టర్ ఇడ్లీ తీసిన సినిమా చూసిన జనం, కనిపిస్తే కొట్టేందుకు సిద్దపడ్డారని హీరో ఫోన్లో చెబుతాడు. అచ్చంగా అలాంటి సీనే స్కంద మూవీ విషయంలో రిపీట్ అవుతున్నట్టుంది. ఇదో డిజాస్టర్ అనే సంగతి ఇంకా బోయపాటి శీనుకి అర్ధం కాలేనట్టుంది. అందుకే ఇంకా ఓ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నామనే సంతోషంలో, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మూవీ అంటూ బిస్కెట్ వేస్తున్నాడంటున్నారు. గతంలో తమిళ స్టార్ సూర్యకి కథ చెప్పి అక్కడ రిజెక్షన్‌ని ఫేస్ చేసిన బోయపాటి.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబుకు బిస్కెట్ వేసే పనిలో ఉన్నట్టున్నాడు.
ఎలాగూ డిసెంబర్లో గుంటూరు కారం షూటింగ్ పూర్తవుతుంది. రాజమౌళి ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు ఇంకాస్త లేటయ్యేలా ఉంది. కాబట్టి, ఈలోపు మహేశ్‌ని బుట్టలో పడేస్తే ఎలా.. అనే ఆలోచనతో సందర్భం ఉన్నా, లేకున్నా ఇంటర్వూల్లో సూపర్ స్టార్‌ని పొగుడుతూ బిస్కెట్స్ వేస్తున్నాడని అంటున్నారు. మొన్న బన్నీ సపోర్ట్‌తో గీతా ఆర్ట్ బ్యాగ్రౌండ్‌తో తమిళ స్టార్ సూర్య డేట్లు పట్టే ప్రయత్నం చేశాడు. రెండో సారి చేసిన ప్రయత్నం కూడా బెడిసికొడుతున్నట్టే ఉంది. అందుకే లోకల్ తెలుగు సూపర్ స్టార్ మీద కన్నేశాడు. అసలే రామ్ కంటే ముందు రామ్ చరణ్‌కి, ఎన్టీఆర్‌కి డిజాస్టర్లు ఇచ్చాడు బోయపాటి.
అవి ఆ హీరోల ఇమేజ్‌ని డ్యామేజ్ చేసిన మూవీలని ఒప్పుకోవడానికి ఈ దర్శకుడికి ఏడాకిపైనే పట్టింది. అతి కష్టం మీద అఖండ హిట్టై మళ్లీ స్వింగ్‌లోకి వచ్చాడనేలోపు మరో వినయ విధేయ రామ లాంటి మూవీ స్కందని ఇచ్చి మతిపోగొట్టాడు. ఇలా అయితే పెద్ద హీరోలు కాదు కదా.. టైర్ టూ హీరోలు కూడా ఈ దర్శకుడికి దొరకటం కష్టం. రియాలిటీకి దూరంగా ఉంటే, ఫ్యూచర్ కష్టం. ఇది బోయపాటిపై సినీజనాల్లో భారీగా పెరిగిన కామెంట్ల దాడి.