Boyapati Srinu: అరవ అడ్డాలో అడుగుపెట్టనున్న బోయపాటి శీను
చరణ్‌కి వినయ విధేయ రామ, ఎన్టీఆర్‌కి దమ్ము, హీరో రామ్‌కి స్కంద.. ఇలా ఒక్కో స్టార్‌కి ఒక్కో డిజాస్టర్ ఇచ్చాడు బోయపాటి. ఈ దెబ్బతో ఇక తను దుకాణం సర్దుకోవాల్సిందే అన్న కామెంట్స్ పెరిగాయి. బాలయ్యకి తప్ప బోయపాటి డైరెక్షన్ మరెవరికీ సెట్ అవదనేంతగా ట్రోలింగ్ పెరిగాయి.

Boyapati Srinu: బోయపాటి శీను తీసిన స్కంద ఊహించని రేంజ్‌లో డిజాస్టర్ అవటంతో, ఇక హీరోలు తనని దూరం పెట్టేలా ఉన్నారు. చరణ్‌కి వినయ విధేయ రామ, ఎన్టీఆర్‌కి దమ్ము, హీరో రామ్‌కి స్కంద.. ఇలా ఒక్కో స్టార్‌కి ఒక్కో డిజాస్టర్ ఇచ్చాడు బోయపాటి. ఈ దెబ్బతో ఇక తను దుకాణం సర్దుకోవాల్సిందే అన్న కామెంట్స్ పెరిగాయి. బాలయ్యకి తప్ప బోయపాటి డైరెక్షన్ మరెవరికీ సెట్ అవదనేంతగా ట్రోలింగ్ పెరిగాయి. ఏదేమైనా ఆపద సమయాల్లో నటసింహమే బోయపాటికి ఆఫర్స్ ఇచ్చాడు.
ఈ సారి సీన్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చినట్టున్నాడు. అంటే తన మేకింగ్‌లో బన్నీ సినిమానా అంటే అదేం లేదు. గీతా ఆర్ట్స్ తరపున బోయపాటికి మంచి సపోర్ట్ అందింది. కోలీవుడ్ స్టార్ డేట్లు పట్టడంలో బన్నీ సాయం చేస్తున్నాడట. తమిళ హీరో సూర్యతో బోయపాటి సినిమా ఆల్‌మోస్ట్ ఓకే అయ్యింది. నిజానికి స్కంద సినమా చేయాల్సింది సూర్య. తను అప్పట్లో రిజెక్ట్ చేసినందుకు, ఇప్పుడు సంతోష పడుతున్నట్టున్నాడు. అలాంటిది సూర్య ఎలా బోయపాటికి ఆఫర్ ఇస్తాడనే డౌట్ రాకమానదు. ఇక్కడే గీతా ఆర్ట్స్ రంగంలోకి దిగిందని తెలుస్తోంది. బోయపాటితో సూర్య సినిమాను అల్లు అరవిందే ఫిక్స్ చేస్తున్నాడట.
ఈ విషయంలో బన్నీ బ్యాగ్రౌండ్ సపోర్ట్ ఇస్తున్నాడట. తనకి సరైనోడు లాంటి హిట్ ఇచ్చాడన్న కృతజ్ఞతతో బన్నీ ఇలా బోయపాటి దుకాణం బందయ్యే టైంలో సాయం చేస్తున్నాడనే మాట వినిపిస్తోంది. ఏదేమైనా తెలుగులో దుకాణం సర్దే టైం వచ్చిందని అరవ అడ్డాలో అడుగు పెట్టేపనిలో ఉన్నాడు బోయపాటి.