Boyapati Srinu: బాలయ్య కూడా బోయపాటి అంటే కంగారు పడుతున్నాడా..?
ఐకాన్ స్టార్ ఇప్పుడు బోయపాటి సినిమా అంటే పరుగో పరుగట. తనకి సరైనోడు లాంటి హిట్ ఇచ్చినప్పటికీ, తర్వాత వినయ విధేయ రామ, స్కంద ప్లాపులతో బోయపాటి అంటే బన్నీకే కాదు, ఆల్‌మోస్ట్ అందరు హీరోలకి భయం పట్టుకున్నట్టుంది.

Boyapati Srinu: బోయపాటి శీను పేరు చెబితే హీరోలు, నిర్మాతలు పరార్.. ఇదో కామెంట్. లేదంటే స్కంద తర్వాత కనిపించిన ట్రోలింగ్ కావొచ్చు. కాని తనకి గీతా ఆర్ట్స్ పిలిచి మరీ ఆఫర్ ఇచ్చింది. ఇదంతా చూసీ బన్నీతోనే బోయపాటి శీను మూవీ అనేంతగా ప్రచారం జరిగింది. కాని ఐకాన్ స్టార్ ఇప్పుడు బోయపాటి సినిమా అంటే పరుగో పరుగట. తనకి సరైనోడు లాంటి హిట్ ఇచ్చినప్పటికీ, తర్వాత వినయ విధేయ రామ, స్కంద ప్లాపులతో బోయపాటి అంటే బన్నీకే కాదు, ఆల్‌మోస్ట్ అందరు హీరోలకి భయం పట్టుకున్నట్టుంది.
Rashmika Mandanna: లేడీ యానిమల్‌కి బంపర్ ఆఫర్.. వరుసగా పాన్ ఇండియా ఆఫర్లు
అఖండ హిట్ అయినా, అందులో అఘోరా పాత్ర లేకపోతే అది గాడి తప్పేదనే కామెంట్లు వచ్చాయి. లిమిట్స్ లేని వయొలెన్స్, అతి ఫైట్లు, లాజిక్ లేని సీన్లతో బోయపాటి శీను తన సినిమాను తనే డ్యామేజ్ చేస్తున్నాడన్నారు. అలాంటి తనతో గీతా ఆర్ట్స్ సినిమాకు కమిటవ్వటానికి రీజన్ బాలయ్య డేట్లు పట్టాలనుకోవటమే. తనతో ఎలాగైనా మూవీ తీయాలనేది అల్లు అరవింద్ కోరికట. అందుకు బోయపాటే సరైన వ్యక్తని తనకి ఆఫర్ ఇచ్చాడంటున్నారు. మరి అఖండ 2 ప్లాన్ ఉండగానే ఈ కాంబినేషన్‌లో సినిమా తీస్తారా అంటే, ఐతే ప్రత్యేకమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కొచ్చు.
లేదంటే అఖండ 2 ప్రొడక్షన్‌లో గీతా ఆర్ట్స్ కూడా జాయిన్ కావొచ్చు అంటున్నారు. ఇక గీతా ఆర్ట్స్ అయితే బన్నీతో బోయపాటిని ఓసారి కూర్చోబెట్టి మాట్లాడిందట. తమిళ స్టార్ హీరో సూర్య దగ్గరకు కూడా రెండు సార్లు రాయబారం పంపిందట. కాని ఇద్దరు హీరోలు నో అనటంతో, బోయపాటి, బాలయ్య కాంబో కోసం అల్లు అరవింద్ ప్రయత్నాలు మొదలయ్యాయట.