Skanda: అయ్యా బోయపాటి.. మీకో దండం.. ఇప్పటికైనా ఈ సినిమాలు ఆపు..!!
ముందొక ట్రైలర్ వదిలారు.. 60 ఎంఎం రాడ్డుకు ఎక్కువ.. 90ఎంఎం రాడ్డుకు తక్కువ అన్నట్లు అనిపించింది ట్రైలర్. అలాంటి రాడ్డు ట్రైలర్ చూసి కూడా సినిమాకు ఎందుకు వచ్చామో అర్థం కాని పరిస్థితి చాలామందిది!
Skanda: కెమెరాలు స్టార్ట్.. రెడీ… బాబు రెడీ బాబు.. స్టార్ట్ కెమెరా… యాక్షన్.. ఇలా స్టార్ట్ అవుతుంది బోయపాటి మూవీ. ప్రతీ సినిమా ముందే ఇదే వస్తే పర్లేదు.. ప్రతీ సినిమా ఒకేలా ఉంటేనే అసలు సమస్య. మిక్స్‌డ్ ఫ్రూట్ జ్యూస్ తెలుసుగా..! అన్ని పండ్లు కలిపేసి, రుబ్బేసి ఓ జ్యూస్‌లాగా ఇస్తారు.. బోయపాటి సినిమాలు కూడా అంతే ! మిక్స్‌డ్ ఫ్రూట్ జ్యూస్‌లా ఉంటాయ్. మిక్స్ అంటే మళ్లీ ఎమోషన్స్ అనుకునేరు..! కథల గురించి మేము చెప్పేది.
ఫిజిక్స్‌కు కూడా అర్థం కాని ఫార్ములాలు.. కెమిస్ట్రీ మదికి కూడా చిక్కని రియాక్షన్లు బోయపాటి సినిమాల్లోనే చూస్తుంటాం ఎక్కువ. అప్పుడెప్పుడో భద్ర ఒక్కటే కొత్తగా అనిపించింది. ఆ తర్వాత ప్రతీది ఒకేలా ఉంటుంది బోయపాటి సినిమా. హీరో ఉంటాడు. విలన్‌ను కుక్కను కొట్టినట్లు కొడతారు. విలన్‌ను కొట్టడానికి ముందు.. కింద రౌడీలను కొడతాడు గురూ.. మాములుగా ఉండవు సీన్లు! ఎందుకు కొడతాడో హీరోకు తెలియదు.. ఎందుకు కొట్టించుకుంటారో ఆ రౌడీలకు తెలియదు పాపం ! బోయపాటి సినిమా అంటే.. చాలామందిలో ఉన్న ఒపీనియన్ ఇది. ఇదంతా వదిలేద్దాం.. స్కంద సినిమా విషయానికి వద్దాం కాసేపు ! ముందొక ట్రైలర్ వదిలారు.. 60 ఎంఎం రాడ్డుకు ఎక్కువ.. 90ఎంఎం రాడ్డుకు తక్కువ అన్నట్లు అనిపించింది ట్రైలర్.
అలాంటి రాడ్డు ట్రైలర్ చూసి కూడా సినిమాకు ఎందుకు వచ్చామో అర్థం కాని పరిస్థితి చాలామందిది! ట్రైలర్ సరిగ్గా కట్ చేయలేదేమో.. సినిమాలో అయినా మ్యాజిక్ ఉంటుందని ఆలోచిస్తే.. సూర్యుడి మీద టవల్ ఆరేయాలనుకున్నంత అమాయకంగా ఉంటుంది. ఒకటే కత్తుల మ్యూజిక్. అదేదో కొబ్బరి బోండాంలో స్ట్రాలు గుచ్చేసినట్లు గుచ్చేస్తుంటారు హీరో. ఎక్కడో చూసినట్లు అనిపిస్తే అది మీ తప్పు కాదు. ఎందుకంటే అలాంటి సీన్లు ఇంతముందు బోయపాటి సినిమాల్లోనే చూసి ఉంటాం. అయ్యా బోయపాటి గారు.. ఇప్పటికైనా సినిమాలతో జనాలను టార్చర్ పెట్టడం ఆపేస్తే.. ఏటా ఇంత అని రెండు రాష్ట్రాల జనాలంతా చందాలు వేసి మిమ్మల్ని పోషిస్తారు అంటున్నారు స్కంద మూవీ చూసిన జనాలు. మీకు, మీ సినిమాలకో దండం.
ఇలాంటి సినిమాలు తీసి మమ్మల్ని చంపొద్దు అంటూ ఘాటుగా రాసుకొస్తన్నారు. బోయపాటి సినిమాల్లో రాడ్ అంటే వినయ విధేయ రామ అని గురించి చెప్తారు ఇప్పటివరకు ! ఇప్పుడు ఆ ప్లేస్‌ను స్కంద భర్తీ చేసింది. వినయ విధేయ రామలో కనీసం పాటలైనా బాగుంటాయ్. ఇందులో ఏముంది బొక్క. గండరభాయ్ తప్ప !