Bpyapati : ఆ రెండిటిలో బోయ‌పాటి ..ముందు ఏది మొద‌లెడ‌తాడ‌బ్బా..!

టాలీవుడ్ (Tollywood) మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడిగా బోయ‌పాటి శ్రీను (Boyapati Srinu) క్రేజ్ వేరే లెవ‌ల్‌.. ప్ర‌తీ ద‌ర్శ‌కుడికీ ఓ బ‌లం ఉన్న‌ట్లే.. బోయ‌పాటి శ్రీ‌నుకీ ఓ డిఫ‌రెంట్ స్టైల్ ఉంది. హీరోయిజం, ఎలివేష‌న్లు, కాస్త ఎమోష‌న్‌..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 23, 2024 | 09:50 AMLast Updated on: Feb 23, 2024 | 9:50 AM

Boyapati Which Of Those Two Will Start First

టాలీవుడ్ (Tollywood) మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడిగా బోయ‌పాటి శ్రీను (Boyapati Srinu) క్రేజ్ వేరే లెవ‌ల్‌.. ప్ర‌తీ ద‌ర్శ‌కుడికీ ఓ బ‌లం ఉన్న‌ట్లే.. బోయ‌పాటి శ్రీ‌నుకీ ఓ డిఫ‌రెంట్ స్టైల్ ఉంది. హీరోయిజం, ఎలివేష‌న్లు, కాస్త ఎమోష‌న్‌.. ఇవ‌న్నీ బోయ‌పాటి సినిమాల ముడి స‌రుకులు, మూల స్తంభాలు.. హీరోని ఆకాశ‌మంత స్థాయిలో చూపించి, .. ప్రేక్ష‌కుడు ఆ భ్ర‌మలో ఉండ‌గానే తాను చెప్పాలనుకున్న క‌థ చెప్పేసి హిట్ కొట్టేయడం బోయ‌పాటి స‌క్సెస్ స్టైల్.. ఆ స్టైల్‌తోనే బోయ‌పాటి ఎన్నో హిట్లు కొట్టాడు.. అయితే.. ఈ మ‌ధ్య రిలీజ్ అయిన స్కంధ మాత్రం బోయ‌పాటికి గ‌ట్టి షాకివ్వ‌గా.. ఆయ‌న చేయ‌బోయే నెక్స్ట్ మూవీస్‌పై తీవ్ర‌ ఉత్కంఠ ఏర్ప‌డింది.

ఇందులో మొయిన్ రెండు సినిమాలు లైన్‌లో ఉన్న‌ట్లు తెలుస్తుండ‌గా.. అందులో ఫ‌స్ట్ ఏది ప‌ట్టాలెక్క‌బోతుంద‌న్న‌ది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఇటీవల ప్రముఖ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాని ఫిక్స్ చేసుకున్న బోయపాటి.. మరోవైపు బాలయ్య కోసం అఖండ 2 మూవీ స్టోరీ కూడా సిద్ధం చేస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. గీతా ఆర్ట్స్ వారి మూవీని అల్లు అర్జున్ తో తీయ‌బోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అటు.. బాల‌య్యతో తీయ‌బోతున్న అఖండ-2 (Akhanda-2) ను కూడా ఓ ప్ర‌ముఖ సంస్థ నిర్మించ‌నుంద‌ట‌.. అయితే ఇప్పుడు అస‌లు మ్యాట‌ర్ ఏమిటంటే.. అసలు ఈ రెండింటిలో బోయపాటి శ్రీను ఏది ముందు స్టార్ట్ చేస్తారు అన్న ప్రస్తుతం టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. కొందరేమో అల్లు అర్జున్ మూవీ అంటుంటే మరికొందరేమో అఖండ 2 అంటున్నారు.

కాగా.. బోయ‌పాటి శ్రీనివాస్ గ‌తేడాది స్కంద (Skanda) మూవీతో ప్రేక్ష‌కుల ముందుకురాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్టార్‌గా మిగిలింది. రామ్ పోతినేని హీరోగా న‌టించిన ఈ చిత్రంలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా న‌టించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఈ మూవీ అటు బోయ‌పాటికి.. ఇటు రామ్‌కి గ‌ట్టి షాక్ ఇచ్చింది. దీంతో.. బోయ‌పాటి త‌న నెక్ట్స్ మూవీ రిజ‌ల్ట్‌పై గ‌ట్టిగా ఫోక‌స్ పెట్టార‌ట‌.. ముందుగా బాల‌య్య బాబుతో అఖండ్ -2 స్టార్ట్ చేసినా.. లేదా అల్లు అర్జున్‌ (Allu Arjun) తో సినిమా మొద‌లు పెట్టినా.. గ‌ట్టి హిట్టు కొట్టాల‌ని గ‌ట్టిగా ఫిక్స‌యిపోయార‌ట‌.. మ‌రి… ఇందులో ఏ సినిమా ముందుగా ప‌ట్టాలెక్క‌నుందో చూడాలి మ‌రి..