బాలయ్య లెక్క వేరు.. మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్, అదిరిపోయే ఓపెనింగ్స్

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో టాలీవుడ్ ను షేక్ చేస్తున్నారు. తనను తక్కువ అంచనా వేసిన వాళ్లందరికి బాలయ్య సరైన సమాధానం చెబుతూ దూసుకుపోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 16, 2025 | 12:26 PMLast Updated on: Jan 16, 2025 | 12:26 PM

Break Even In Three Days Amazing Openings

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో టాలీవుడ్ ను షేక్ చేస్తున్నారు. తనను తక్కువ అంచనా వేసిన వాళ్లందరికి బాలయ్య సరైన సమాధానం చెబుతూ దూసుకుపోతున్నారు. అఖండ సినిమా తర్వాత నుంచి కథల విషయంలో పక్కా లెక్కలతో ప్లాన్ చేసుకుంటున్న బాలయ్య ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు. తన కథలపై అలాగే తన అభిమానులపై ఎక్కువ నమ్మకం ఉంచిన ఈ నందమూరి నటసింహం ప్రమోషన్స్ విషయంలో కూడా ఎక్కువగా ఫోకస్ చేయడం లేదు.

వేరే హీరోలు రికార్డులతో దుమ్మురేపాలని ప్రయత్నం చేస్తున్న టైంలో బాలకృష్ణ మాత్రం తన సినిమాలపై సైలెంట్ గా ఫోకస్ చేస్తూ వైలెంట్ హిట్లు కొడుతున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి ఉందంటూ నందమూరి అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. సంక్రాంతి కానుకగా బాలకృష్ణ ఇచ్చిన గిఫ్ట్ అదిరిపోయింది అని బాలయ్య అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాను ట్రోల్ చేసిన మెగా అభిమానులకు గట్టి షాక్ తగిలింది.

గేమ్ చేంజర్ సినిమా ఓ రేంజ్ లో ఉందంటూ ముందు ప్రమోషన్స్ చేసిన మెగా అభిమానులు డాకూ మహారాజ్ దాటికి సైలెంట్ అయిపోయారు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద డాకు మహారాజ్ రికార్డు వసూళ్లు సాధిస్తోంది. సంక్రాంతి కానుకగా ఆదివారం ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 92 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు సినిమా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు సితార ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. సంక్రాంతి కానుకగా బ్లాక్ బాస్టర్ గా నిలిచిన డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులు అలరిస్తోందని… ఈ సంక్రాంతికి రాజు డాకు మహారాజు అంటూ పోస్ట్ చేసింది.

ఈ మహారాజు.. బాక్సాఫీస్, హృదయాలను ఒకే రకంగా శాసిస్తున్నారని.. కుటుంబ ఎమోషన్స్ తో నిండిన పరిపూర్ణమైన సంక్రాంతి ట్రీట్ అంటూ పోస్ట్ చేసింది. ఈ సినిమాకు మొదటి రోజు 56 కోట్లకు పైగా వసూళ్లు రాగా రెండో రోజు 74 కోట్లకు పైగా వసూలు వచ్చాయి. ఇక బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా డాకు మహారాజ్ నిలిచింది. సినిమాలో బాలయ్య యాక్షన్ తో పాటుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ దుమ్ము రేపటంతో సినిమా వసూళ్లు అల్లాడిస్తున్నాయి. ఈ సినిమాకు పోటీగా వచ్చిన వేరే సినిమాలు అంతగా ప్రభావం చూపకపోవడంతో బాలయ్య సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో షేక్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య పక్కన శ్రద్ధ శ్రీనాథ్ ప్రగ్యా జైస్వాల్ ఊర్వశి రౌతల నటించారు.