దేవర 2 రూమర్స్ కి బ్రేక్… రెండీంటినీ క్లియర్ చేసిన తారక్…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు కూడా ఈ వారం వివాదంలోకి రావటానికి కారణం తన ఫ్యానే... కష్టాల్లో ఉన్నాడని సాయం చేస్తే, కరెన్సీ తక్కువైందన్న కామెంట్ తో, ఎన్టీఆర్ ని ఇరికించేశారు. కట్ చేస్తే వాళ్ల బ్లాక్ మేయిలే సక్సెస్ అయ్యిందన్న కామెంట్లు పెరిగాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 26, 2024 | 05:01 PMLast Updated on: Dec 26, 2024 | 5:01 PM

Break To Deora 2 Rumors Tarak Clears Both

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు కూడా ఈ వారం వివాదంలోకి రావటానికి కారణం తన ఫ్యానే… కష్టాల్లో ఉన్నాడని సాయం చేస్తే, కరెన్సీ తక్కువైందన్న కామెంట్ తో, ఎన్టీఆర్ ని ఇరికించేశారు. కట్ చేస్తే వాళ్ల బ్లాక్ మేయిలే సక్సెస్ అయ్యిందన్న కామెంట్లు పెరిగాయి. ఇలాంటి టైంలో చాలా సింపుల్ గా రెండు రూమర్లకు బ్రేకులేశాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. కొరటాల శివ ఇచ్చిన అప్ డేట్ తో పాటు ఎన్టీఆర్ కూడా అప్ డేట్ రెడీ చేసినట్టున్నాడు. దాని వల్లే మ్యాన్ ఆఫ్ మాసెస్ తాలూకు రెండు విషయాల్లో రూమర్లు ఆగిపోయాయి. సింపుల్ గా ఒక వివాదం, ఒక నెగెటీవ్ ప్రచారం.. మొత్తంగా రెండీంటికి ఎండ్ కార్డ్ పడింది. ఐతే ఈ రెండీంట్లో ఒకటి మాత్రం ఫ్యాన్స్ ని పండగ చేసుకునేలా చేస్తోంది. ఏంటది?

దేవర 2 మూవీ ఉంటుదా? ఉండదా?లాంటి డౌట్లకు మొన్నే కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు. దేవర స్క్రీప్ట్ పనులు మొదలుపెట్టినట్టు స్టేట్ మెంట్తో ఫ్యాన్స్ కి ఊపు తెచ్చాడు. కట్ చేస్తే ఇప్పుడు దేవర 2 మూవీ షూటింగ్ షురూ చేసేందుకు ముహుర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఎంటైర్ టీంని కొరటాల శివ అలర్ట్ చేస్తూ షెడ్యూల్ కూడా ప్లాన్ చేశాడు. దేవర 2 ఇప్పట్లో మొదలౌతుందో లేదో అన్న డౌట్లకు గేట్లు క్లోజ్ చేశాడు.

అయితే ఈ విషయం కంటే, తన ఫ్యాన్ కి సాయం చేసే విషయంలోనే వివాదంలో చిక్కుకున్నాడు ఎన్టీఆర్. క్యాన్సర్ తో బాధపడుతున్న పేషెంట్ కౌశిక్ కి, సాయం చేశాడు తారక్. ఫోన్ చేశాడు. భరోసా ఇచ్చాడు.. తన ఫ్యాన్స్ రెండున్నర లక్షలు కట్టారన్నారు. కాని ఎన్టీఆరే ఇంకా ఏడబ్బు పంపలేదన్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్యాచ్ కూడా ఆ పేషెంట్ ఫ్యామిలీ చేసిన తప్పులని, డబ్బుల లెక్కలని వివరించి వీడియోలు పెట్టింది. అభిమాని పేరుతో ఆఫ్యామిలీ ఎన్టీఆర్ ని బ్లాక్ మేయిల్ చేస్తున్నట్టు కామెంట్ల కౌంటర్లు కూడా నడిచాయి…

ఐతే ఇదంతా ఎందుకనుకున్నాడో, లేదంటే ఈ వివాదాన్ని క్లోజ్ చేయాలనుకున్నాడో మొత్తానికి ఎన్టీఆరే 12 లక్షలు పే చేయించి కౌశిక్ ఫ్యామిలీకి సాయం చేశాడన్నారు. కాని రియాలిటీ మరోలా ఉంది. అదేంటంటే కౌశిక్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సాయం చేసిన తర్వాత ఎన్టీఆర్ 12 లక్షలు సాయం పంపిస్తే, అది వాళ్లను చేరే లోపే, కౌశిక్ తల్లి తొందర పడి స్టేట్ మెంట్ ఇచ్చిందట.

దీంతో ఇలా కూడా అభిమాని కోసం సాయం చేయబోతే ఎన్టీఆర్ అనవసరంగా బ్లేమ్ అయ్యాడనే కామెంట్లే పెరిగాయి. ఏదేమైనా ఈ చాప్టర్ క్లోజ్ అయ్యింది. ఇక దేవర 2 విషయానికొస్తే, ఇది 2026 లో మొదలౌతుందని, ఈలోపు వార్2, డ్రాగన్ ని ఎన్టీఆర్ కంప్లీట్ చేసి, నెల్సన్ దిలీప్ తో సినిమా చేస్తాడన్నారు.

నెల్సన్ జైలర్ 2 మూవీ 2025 ఎండ్ లోగా పూర్తవుతుంది కాబట్టి, 2026 ఎండ్ లోనే దేవర 2 కి ఛాన్స్ ఉంది… ఆలోగా నాగవంశీ ప్రొడక్షన్ లో నెల్సన్ దిలీప్ తో తారక్ మూవీ ఉంటుందని, రీసెంట్ గా స్టోరీ నెరేషన్ అయ్యిందని ప్రచారం జరిగింది. ఐతే సంక్రాంతికి దేవర 2 ని లాంచ్ చేసి, మార్చ్ నుంచి దేవర 2 షూటింగ్ ని షురూ చేస్తాడట కొరటాల శివ. మారుతి ఎలాగైతే ది రాజా సాబ్ ని నిదానంగా తీస్తూపోయాడో…. అలా దేవర 2ని ఎన్టీఆర్ తో పార్టులు పార్టులుగా ప్లాన్ చేశాడట కొరటాల. అందుకే నెలకో 10 రోజులు డేట్లు సాధించుకున్నాడని తెలుస్తోంది… కాకపోతే లుక్ సినిమా సినిమాకు మారాలి కాబట్టి, ప్యార్ లల్ గా డ్రాగన్, దేవర2, నెల్సన్ దిలీప్ సినిమాలు ఎలా సాధ్యమో మాత్రం ఇంకా తేలలేదు…