బ్రేకింగ్: బాలకృష్ణ ఇంటికి అల్లు అరవింద్, రాయబారం కోసమా…?
సంధ్య థియేటర్ వ్యవహారం నుంచి బయటకు రావాలని అల్లు ఫ్యామిలీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అల్లు అరవింద్ తన కొడుకుని ఈ కేసు నుంచి బయటకు తెచ్చేందుకు ప్రభుత్వాన్ని శాంతింప చేసేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు.
సంధ్య థియేటర్ వ్యవహారం నుంచి బయటకు రావాలని అల్లు ఫ్యామిలీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అల్లు అరవింద్ తన కొడుకుని ఈ కేసు నుంచి బయటకు తెచ్చేందుకు ప్రభుత్వాన్ని శాంతింప చేసేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక అర్జున్ మామ కూడా ఢిల్లీ స్థాయిలో తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే వాళ్ళ ద్వారా ఈ సమస్యను కాస్త తగ్గించే ప్రయత్నం అల్లు అరవింద్ మొదలుపెట్టారు. అయితే చిరంజీవి ఇప్పటికే అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇదే టైంలో నందమూరి బాలకృష్ణ ద్వారా రేవంత్ రెడ్డి తో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అల్లు అరవింద్. రేవంత్ రెడ్డికి అలాగే బాలకృష్ణకు మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు నందమూరి బాలకృష్ణతో సన్నిహితంగానే మెలిగారు. బాలయ్య నిర్వహించిన ప్రచారంలో కూడా అప్పట్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. దీనితో ఎలాగైనా సరే రేవంత్ రెడ్డి ని కూల్ చేసేందుకు బాలకృష్ణ ద్వారా వెళ్లాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు అల్లు అరవింద్.
సినిమా పరిశ్రమ రేవంత్ రెడ్డి నిర్ణయంతో మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉండటం తన కొడుకు సినిమా భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితిలో ఉండటంతో అల్లు అరవింద్ జాగ్రత్తలు పడుతున్నారు. ఇప్పటికే సమాజంలో అల్లు అర్జున్ ను ఒక దోషిగా చూడటం మొదలుపెట్టారు. దీనితో ఈ వ్యవహారం నుంచి ఎలాగైనా బయటకు తీసుకురావాలని నానా కష్టాలు పడుతున్నారట అల్లు అరవింద్. రేవంత్ రెడ్డి ఎక్కడా వెనకడుగు వేసే అవకాశం లేకపోవడంతో ఏం చేయాలనే దానిపై అటు చిరంజీవితో కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది.
చిరంజీవి కూడా ఇప్పటికే శనివారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపై కాస్త అసహనం వ్యక్తం చేశారట. ముఖ్యంగా అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ పై చిరంజీవి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి క్షమాపణ చెప్పకుండా అనవసరంగా సమస్యను మరింత పెంచే విధంగా అల్లు అర్జున్ వ్యాఖ్యలు ఉన్నాయని చిరంజీవి కామెంట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఈ విషయంలో అల్లు అరవింద్ కు ఎవరు సహకరిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ నష్టపరిహారం కింద 50 లక్షలు రేవతి భర్తకు అందించారు. అటు చిన్నారి భవిష్యత్తుపై కూడా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అటు అల్లు అర్జున్ కూడా చిన్నారికి తన వంతుగా 50 లక్షల సహాయం చేయాలని భావిస్తున్నడని తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు సహాయం అందించింది.