బ్రేకింగ్: అల్లు అర్జున్ కు బెయిల్
సంధ్య థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తెలంగాణా హైకోర్ట్. కాసేపటి క్రితం అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.
సంధ్య థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తెలంగాణా హైకోర్ట్. కాసేపటి క్రితం అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరిక్షల అనంతరం అల్లు అర్జున్ కు కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. సుదీర్ఘ వాదనల అనంతరం అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అల్లు అర్జున్‌కు బీఎన్ఎస్ చట్టం వర్తించదని వాదనలు వినిపించారు లాయర్ నిరంజన్ రెడ్డి.
అసలు ఈ కేసుతో అల్లు అర్జున్ కు సంబంధం ఏంటని ప్రశ్నించిన కోర్టు… మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కాసేపట్లో బెయిల్ ఉత్తర్వులతో చంచల్ గూడ జైలుకు లాయర్ నిరంజన్ రెడ్డి వెళ్లనున్నారు. పరోక్షంగా ఆ వ్యక్తి మరణనానికి అల్లు అర్జున్ కారణం ఎలా అవుతాడంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. పర్సనల్ బాండ్ తీసుకుని విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇది మధ్యంతర బెయిల్ మాత్రమే అని రెగ్యులర్ బెయిల్ పై నాంపల్లి కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేయాలని కోర్ట్ ఆదేశించింది.