రివ్యూకి రికార్డులు బద్దలు… ఫ్యాన్స్ కి ఇక పండగే పండగ…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరగా వచ్చాడు. నిన్న లాస్ ఏంజిల్స్ లో బియాంగ్ ఫెస్ట్ లో ఈ సినిమా ప్రివ్యూకి హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా చప్పట్లు కొడితే, ఇప్పుడు ఆడియన్స్ వంతొచ్చింది. ఐదు భాషల్లో ప్రివ్యూకి రివ్యూలు రాసేందుకు వెబ్ సైట్లే కాదు, మీడియా బ్యాచ్ అంతా క్యూ కట్టింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 26, 2024 | 07:28 PMLast Updated on: Sep 26, 2024 | 7:37 PM

Breaking Records For The Review More Festival For The Fans

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరగా వచ్చాడు. నిన్న లాస్ ఏంజిల్స్ లో బియాంగ్ ఫెస్ట్ లో ఈ సినిమా ప్రివ్యూకి హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా చప్పట్లు కొడితే, ఇప్పుడు ఆడియన్స్ వంతొచ్చింది. ఐదు భాషల్లో ప్రివ్యూకి రివ్యూలు రాసేందుకు వెబ్ సైట్లే కాదు, మీడియా బ్యాచ్ అంతా క్యూ కట్టింది. విచిత్రం ఏంటంటే ఫైనల్ టాక్ వింటే మతిపోవాల్సిందే.. బాహుబలి, త్రిబుల్ఆర్, కల్కీ టైంలో కూడా ప్రివ్యూ టాక్ తోనే వసూళ్ల కిక్ పెరిగింది. మరి పాన్ ఇండియా లెవల్లో దూసుకొచ్చిన దేవర ప్రివ్యూ రూపంలో టాక్ తో కిక్ ఇస్తున్నాడా? ప్రివ్యూ చూసిన వాల్ల రెస్పాన్స్ ఏంటి?

దేవర ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ లో కొంతమందికి యూఎస్లో, ఇంకొంతమందికి ఇండియాలో గురువారమే ప్రివ్యూ రూపంలో కాలం కలిసొచ్చింది. దేవర రిలీజ్ డేట్ కి ఒకరోజు ముందే ఈ సినిమాను చూసే చాన్స్ చిక్కింది. నిజానికి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో బియాండ్ ఫెస్ట్ అంటూ బుధవారమే దేవరని ప్రివ్యూగా వేస్తే అక్కడంతా నిలుచుని ఐదు నిమిషాల వరకు చప్పట్లతో ఫిల్మ్ టీంని మెచ్చుకున్నారు

ఇప్పుడు ఇండియా, యూఎస్ లో స్పెషల్ ప్రివ్యూ రూపంలో షో పడిపోయింది. ఆడియన్స్ ని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి స్పెషల్ రివ్యూ పుణ్యామాని ఒకరోజు ముందే దేవర భాగ్యం చిక్కింది. హైద్రబాద్ లో ఫ్రివ్యూ రేటు 500 నుంచి 1000 పలికితే, యూఎస్ లో ఏకంగా 100 డాలర్లు అంటే, ఎనిమిది వేలకు ప్రివ్యూటిక్కెట్టు సేల్ అయ్యింది..

ఇక దేవర మూవీ టాక్ విషయానికొస్తే, ట్రైలర్ లో చూపించినట్టే కథ, కథనం అంతకుమించేలా ఉంది. మొదటి ట్రైలర్ కంటే రెండో ట్రైలరే దేవర అసలు కథని అర్ధమయ్యేలా చేస్తోంది. కొంతంరకు ఆంధ్రావాలా స్టోరీ లైన్ ని పోలి ఉన్న థిన్ లేయర్ కనిపించిందన్న టాక్ పెరిగింది.

కాని ఎన్టీఆర్ ని ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో కాని ఎన్టీఆర్ ని ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చూపించాడు కొరటాల శివ. ట్రైలర్ లో షార్క్ సీన్ మీద ఎంత ట్రోలింగ్ జరిగిందో కాని, అసలు సినిమాలో ఏదైనా మ్యాజిక్ ఉందంటే, అది షార్క్ సీనే అన్న టాక్ పెరిగింది. సో ట్రైలర్ లో సింగిల్ షాట్ చూసి సరిగా జడ్జ్ చేయని బ్యాచ్ ట్రోల్ చేసింది. కాని, అసలు దేవర క్లైమాక్స్ ఫైట్ మతిపోగొడుతోంది. షార్ట్ ని ఎన్టీఆర్ స్వారి చేసే సీన్ కి, ఇంకా కంటైనరలను నీటిలో ట్రాన్స్ పోర్ట్ చేసే సీన్లు కి భారీగా రెస్పాన్స్ వస్తోంది

నిజంగానే కొరటాల శివ దేవర అండర్ వాటర్ ఫైట్ సీన్ మీద నమ్మకంతోనే రెండు భాగాలు ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఆ కాన్ఫిడెన్స్ కి తగ్గ సాలిడ్ సీన్లు మూడు దేవర రేంజ్ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళుతున్నాయి. యూఎస్, ఆస్ట్రేలియా, ముంబై నుంచి వస్తున్న రిపోర్టులు చూస్తే దేవర అరాచకం నిజంగానే త్రిబుల్ ఆర్ ని మించేలా ఉంది

ఎందుకంటే త్రిబుల్ ఆర్ లోకూడా ఎన్టీఆర్ మహా అయితే, ఎంట్రీ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్ , లోనే తన పాత్ర హైలెట్ అయ్యింది. క్లైమాక్స్ ఫైట్ లో కూడా రామ్ చరణ్ పాత్రకే ఎక్కువ సీన్ ఇచ్చాడు రాజమౌలి. కాని దేవర మల్టీస్టారర్ మూవీ కాదు, దీనికి తోడు దేవరలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 3 హై ఇంటెన్స్ ఫైట్ సీన్లు, ఎమోషనల్ డ్రామాతో నడవటం, వాటికి హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ తోడవ్వటంతో, గూస్ బంప్స్ వస్తున్నాయి. బాక్సాఫీస్ లో వసూళ్ల వరదలు కన్ఫామ్ అయ్యాయి. హైద్రబాద్ రిపోర్ట్ కూడా యూఎష్, ఆస్ట్రేలియా, ముంబై రిపోర్ట్ తో పోలిస్తే ఓరేంజ్ లోనే ఉంది. దేవరకి ప్రివ్యూ లో పాస్ మార్కులు కాదు డిస్టింక్షన్ వచ్చేసినట్టే అన్న మాటలు వినిపిస్తున్నాయి.