Bro TheAvatar: ఒకే ఫ్రేమ్‌లో మామా-అల్లుడు.. లుక్‌ అదిరింది బ్రో..

ఈసారి మామా అళ్లుల్లు ఒకే ఫ్రేమ్‌లో ఉన్న పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. పోస్టర్‌లో ఇద్దరూ సీరియస్ లుక్‌లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌ని బట్టి చూస్తే ఇది ఫైట్‌ సీన్‌కు సంబంధించిన ఫొటోలా ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 29, 2023 | 11:54 AMLast Updated on: May 29, 2023 | 11:54 AM

Bro Theavatar Pawan Kalyan And Saidharam Tej Duo Look Released

Bro TheAvatar: పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ డ్యుయోలో వస్తున్న బ్రో సినిమా నుంచి మరో అప్‌డేట్‌ వచ్చింది. ఈసారి మామా అళ్లుల్లు ఒకే ఫ్రేమ్‌లో ఉన్న పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. పోస్టర్‌లో ఇద్దరూ సీరియస్ లుక్‌లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌ని బట్టి చూస్తే ఇది ఫైట్‌ సీన్‌కు సంబంధించిన ఫొటోలా ఉంది. ఈ పోస్టర్‌ కాస్త అటూఇటూగా గోపాల గోపాల సినిమాను గుర్తు చేస్తోంది.

సముద్రఖని డైరెక్షన్‌లో వస్తున్న బ్రో సినిమాను జులై 28న రిలీజ్‌ చేస్తామని అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో వస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎస్‌ థమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. ఇప్పటికే తమిళ్‌‌లో మంచి హిట్‌ అందుకున్న ఈ సినిమాను అక్కడ సముద్రఖని డైరెక్ట్‌ చేశాడు. తెలుగులో కూడా ఆయనే రీమేక్‌ చేస్తున్నాడు. లాంచింగ్‌ నుంచి క్లైమాక్స్‌ వరకూ ప్రతీ సీన్‌ చాలా ఫాస్ట్‌గా షూట్‌ చేశారు. రీసెంట్‌గానే బ్రో అనే టైటిల్‌ నామకరణం చేసుకున్న ఈ సినిమా నుంచి వరుస అప్‌డేట్స్‌ ఇస్తూ ఫ్యాన్స్‌లో జోష్‌ నింపుతున్నారు మేకర్స్‌.

రీసెంట్‌గానే ఈ సినిమా నుంచి పవన్‌ కళ్యాణ్ లుక్‌తో పాటు బ్రో టైటిల్‌ ట్రాక్‌ను రిలీజ్‌ చేశారు. ఆడియన్స్‌ నుంచి ఆ ట్రాక్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పుడు రిలీజ్‌ చేసిన పోస్టర్‌కు కూడా విశేష స్పందన లభిస్తోంది. క్షణాల్లోనే ఇంటర్నెట్‌లో ఈ పోస్టర్‌ వైరల్‌గా మారింది. ఇక జులై 28న రిలీజ్‌ కానున్న ఈ సినిమా తెలుగులో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.