Sukumar: దుమ్ము రేపిన గురు శిష్యులు.. సుకుమార్, బుచ్చిబాబు సినిమాలకు అవార్డులు
సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పుష్ప మూవీకి బెస్ట్ హీరో, బెస్ట్ మ్యూజిక్ అవార్డు రాగా.. ఆయన శిష్యుడు సానా బుచ్చిబాబు మూవీకి కూడా అవార్డ్ దక్కింది. బెస్ట్ తెలుగు ఫిల్మ్‌గా ఉప్పెన మూవీని జాతీయ అవార్డు వరించింది. ఇలా గురుశిష్యులా.. మజాకా అనుకుంటున్నారు ప్రేక్షకులు.
Sukumar: 69వ జాతీయ సినిమా అవార్డుల్లో టాలీవుడ్ డామినేషన్ క్లియర్‌గా కనిపించింది. పది కీలక కేటగిరిల్లో మన సినిమాదే పైచేయి కనిపించింది. ట్రిపుల్ ఆర్, పుష్ప దుమ్ము దులిపేశాయి. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, బెస్ట్ కొరియోగ్రఫీ, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్, బెస్ట్ లిరిసిస్ట్‌తో పాటు.. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంతోపాటు మొత్తం ఆరు కేటగిరీల్లో ట్రిపుల్‌ఆర్ జోరు చూపించగా.. బెస్ట్ హీరో, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కోటాలో పుష్ప తగ్గేదే లే అంది.
ఉప్పెన, కొండపొలం చిత్రాలకు కూడా చెరొక్క అవార్డ్ దక్కాయి. నేషనల్ బెస్ట్ హీరోగా అవార్డ్ అందుకున్న బన్నీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయగా.. మరిన్ని అద్భుతాలు కనిపించాయి ఈ అవార్డుల్లో..! గురుశిష్యుల సినిమాలకు ఈసారి ఒకేసారి అవార్డు దక్కడం అద్భుతం అనిపిస్తోంది. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన పుష్ప మూవీకి బెస్ట్ హీరో, బెస్ట్ మ్యూజిక్ అవార్డు రాగా.. ఆయన శిష్యుడు సానా బుచ్చిబాబు మూవీకి కూడా అవార్డ్ దక్కింది. బెస్ట్ తెలుగు ఫిల్మ్‌గా ఉప్పెన మూవీని జాతీయ అవార్డు వరించింది. ఇలా గురుశిష్యులా.. మజాకా అనుకుంటున్నారు ప్రేక్షకులు. సినిమాల్లోనే కాదు.. చదువుల్లోనూ బుచ్చిబాబుకు సుకుమార్ గురువు. సుకుమార్ డైరెక్టర్ కాకముందే.. ఆయన దగ్గర బుచ్చిబాబు మ్యాథ్స్ పాఠాలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత సినిమాల మీద ఇంట్రస్ట్‌తో హైదరాబాద్ వచ్చి.. సుకుమార్ దగ్గర శిష్యరికం చేశాడు.
ఉప్పెన సినిమాతో మేకింగ్‌లోనూ, టేకింగ్‌లోనూ గురువుకు ఏ మాత్రం తక్కువ కాదు అనిపించాడు బుచ్చిబాబు. ఉప్పెనలోని చీకట్లో ఫైట్ చూస్తే.. ఓ రకంగా సుకుమార్ మార్క్ కనిపించింది. రంగస్థలంలో సైకిల్ ఫైట్‌ను తలపిస్తుందా సన్నివేశం. ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయా.. ఒకే ఆలోచన ఇద్దరికి వచ్చిందా అనిపిస్తుంది ఆ సీన్ చూస్తే. ఏమైనా గురుశిష్యుల సినిమాలకు ఒకేసారి అవార్డులు రావడం.. అది కూడా నేషనల్ అవార్డులు దక్కడం.. నిజంగా గ్రేట్ అంటూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.