Buchibabu : బుచ్చిబాబుకు పితృ వియోగం

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు.. వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 31, 2024 | 04:30 PMLast Updated on: May 31, 2024 | 4:30 PM

Buchi Babus Father Passed Away Due To Lip Ailment

 

 

 

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు.. వారి కుటుంబ సభ్యులు కన్నుమూస్తున్నారు. వయోభారం, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు ఇతర కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది.

ఉప్పెన (Uppena) మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ప్రముఖ దర్శకులు బుచ్చిబాబు ఇంట విషాదం నెలకొంది. బుచ్చిబాబు తండ్రి పెదకాపు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన ప్రముఖ దర్శకులు సుకుమార్ తో పాటు సినీ ప్రముఖులు బుచ్చిబాబు తండ్రి కి ఘన నివాళులర్పించారు.

ఉప్పెన మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీని మొత్తం తన వైపు తిప్పుకున్నాడు బిచ్చిబాబు సన. మెగా ఫ్యామిలీ (Mega Family) నుంచి వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) ని హీరోగా పరిచయం చేయడమే కాదు.. మంచి పేరు వచ్చేలా చేశాడు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం 100 కోట్లు కలెక్ట్ చేసింది. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్ అందరూ కొత్త వాళ్లతో వచ్చిన ఈ మూవీ కంటెంట్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఒక డబ్యూ హీరో సినిమా ఏకంగా వంద కోట్లు వసూళ్లు చేయడం ఒక రికార్డే. ప్రజెంట్ రామ్ చరణ్ తో ఆర్సీ 16 చేస్తున్నారు. జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది.