Ravi Teja : బడ్జెట్ కష్టాలు.. ఆగిపోయిన రవితేజ, గోపీచంద్ మలినేని మూవీ
మాస్ మహారాజా రవితేజ చివరగా, టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్ గా ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చింది. తదుపరి ప్రాజెక్ట్ గోపీచంద్ మలినేనితో చేతులు కలిపారు.
మాస్ మహారాజా రవితేజ చివరగా, టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్ గా ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చింది. తదుపరి ప్రాజెక్ట్ గోపీచంద్ మలినేనితో చేతులు కలిపారు. కొంతకాలం క్రితం వీరి కాంబోలో సినిమా వస్తోందంటూ అధికారిక ప్రకటన చేశారు. ఈ కాంబో ఇప్పటివరకు భారీ బ్లాక్‌బస్టర్‌లను అందించింది. డాన్ శీను, బలుపు , క్రాక్‌లతో హ్యాట్రిక్ చేసిన తర్వాత, ఈ కాంబో.. మరో హిట్ ని లైన్ లో పెట్టడానికి రెడీ అయ్యింది.
Pawan Kalyan : తెలంగాణలో పంచ్ లు ఉండవా ..? పవన్ ప్రచారం ఇలాగైతే కష్టమేనా..?
ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. బడ్జెట్ సమస్యల కారణంగా సినిమాను హోల్డ్‌లో ఉంచారు. రవితేజ-గోపీచంద్ మలినేని చిత్రం పేపర్‌లో బడ్జెట్‌ను మించిపోతోంది. శాటిలైట్, ఓటీటీ బిజినెస్ భారీగా తగ్గిపోవడంతో బడ్జెట్ రికవరీ కాలేదని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. ఆఫర్లు రాకపోవడం, మునుపటిలా బిజినెస్ జరగకపోవడంతో షూటింగ్ పూర్తి చేసుకున్న చాలా సినిమాలు లోటు రిలీజ్‌ల వల్ల ఇప్పటికే దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన నిర్మాతలు ఈ ప్రాజెక్ట్‌ని హోల్డ్‌లో ఉంచారు.
రవితేజ గోపీచంద్ కాంబోలో తెరకెక్కనున్న ఈ మూవీ కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు. 1990లో అగ్రవర్ణాలు, నిమ్న కులాల మధ్య జరిగిన కుల తగాదాల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. క్రాక్ లాగా, ఈ ప్రాజెక్ట్ కూడా కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందించాలని అనుకుంటున్నట్లు సమాచారం. అంతలోనే ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టడంతో హాట్ టాపిక్ గా మారింంది. ప్రజెంట్ వరుస ప్లాపులతో అల్లాడుతున్న రవితేజ తో భారీ బడ్జెట్ పెట్టడం రిస్క్ అని బావిస్తున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో.