IPL కొత్త సీజన్ లో అల్లు అర్జున్.. అస్సలు తగ్గేదే లే అంటున్న బన్నీ బ్రాండ్..!

IPL ఎక్కడ.. అల్లు అర్జున్ ఎక్కడ..? ఈయన ఏమో సినిమాల్లో సూపర్ స్టార్.. అక్కడేమో క్రికెట్ అభిమానులకు సూపర్ సీజన్..! ఈ రెండింటికి లింక్ ఎక్కడ కుదిరింది అబ్బా అని ఆలోచిస్తున్నారు కదా..! మీకెందుకండీ ఆ ఆలోచన.. మేమున్నాంగా క్లారిటీ ఇవ్వడానికి..!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 13, 2025 | 04:20 PMLast Updated on: Mar 13, 2025 | 4:20 PM

Bunny Brand Says Allu Arjun Will Not Be Reduced In The New Season Of Ipl

IPL ఎక్కడ.. అల్లు అర్జున్ ఎక్కడ..? ఈయన ఏమో సినిమాల్లో సూపర్ స్టార్.. అక్కడేమో క్రికెట్ అభిమానులకు సూపర్ సీజన్..! ఈ రెండింటికి లింక్ ఎక్కడ కుదిరింది అబ్బా అని ఆలోచిస్తున్నారు కదా..! మీకెందుకండీ ఆ ఆలోచన.. మేమున్నాంగా క్లారిటీ ఇవ్వడానికి..! ఇప్పుడు వస్తున్న ఐపిఎల్ సీజన్ కు అల్లు అర్జున్ కు విడదీయరాని బంధం ఉంది. డైజస్ట్ చేసుకోవడం కాస్త కష్టమే కానీ ట్రై చేయండి. మేము చెప్పేది విన్న తర్వాత నిజమే అనుకుంటారు మీరు కూడా. అసలు మ్యాటర్ ఏంటంటే కొన్ని సినిమాలకు అలా బ్రాండ్ పడిపోతుంది. అవి వచ్చి ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లయిన ఆ బ్రాండ్ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇండియన్ సినిమాపై పుష్ప వేసిన బ్రాండ్ కూడా అలాంటిదే. పుష్ప 1 వచ్చి మూడేళ్లు దాటింది.. పార్ట్ 2 వచ్చి 3 నెలలు దాటిపోయింది. అయినా కూడా పుష్ప మేనియా ప్రపంచాన్ని వదలడం లేదు. మరీ ముఖ్యంగా స్పోర్ట్స్ వరల్డ్ మొత్తం పుష్ప ఫ్యాన్స్ అయిపోయారు.

క్రికెట్, ఫుట్బాల్, రగ్బీ ఇలా ఆటతో పనిలేదు.. అన్నిట్లోనూ పుష్ప గాడి రూల్ నడుస్తుంది. క్రికెట్ లో వికెట్ తీసిన, సెంచరీ కొట్టిన, క్యాచ్ పట్టిన ఆటోమేటిక్ గా పుష్పను ఇమిటేట్ చేస్తున్నారు. తాజాగా మార్చి 22 నుంచి ఐపీఎల్ న్యూ సీజన్ షురూ కానుంది. దీనికోసం టీమ్స్ అన్నీ రెడీ అవుతున్నాయి..కొత్త కొత్త థీమ్స్ తో తమ జట్లను ప్రమోట్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ టీం తమ ప్రమోషన్ కోసం పుష్ప 2 సీన్ వాడుకుంది.

సినిమాలో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కు వచ్చి అక్కడ అందరినీ కొనే సీన్ గుర్తుంది కదా.. సేమ్ టు సేమ్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ టీం దీన్ని కాపీ చేశారు. అక్కడ అల్లు అర్జున్ ఉంటే ఇక్కడ ఆ ప్లేస్ లో రవీంద్ర జడేజా ఉన్నాడు. జడేజా అంటే పేరు కాదు బ్రాండ్ అంటూ సేమ్ పుష్ప మేనరిజం చేశాడు టీమిండియా ఆల్ రౌండర్. గతంలోనూ జడేజా పుష్ప మేనరిజం చాలాసార్లు చేసి చూపించాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ టీం యానిమల్ సీన్ హార్దిక్ పాండ్యాతో రీ క్రియేట్ చేశారు. మొత్తానికి ఐపీఎల్ కోసం సినిమాలను బాగా వాడుకుంటున్నారు టీ మేనేజ్మెంట్స్.