సెట్స్ లో అడుగుపెడుతున్న బన్నీ… ముహూర్తం ఫిక్స్ అయిపోయిందా…?

సంధ్య థియేటర్ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ పెద్దగా బయటకు వచ్చే ప్రయత్నం చేయటం లేదు. ఆ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ పరువు పోయింది అనే కామెంట్స్ కూడా గట్టిగానే వచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 5, 2025 | 05:00 PMLast Updated on: Feb 05, 2025 | 5:00 PM

Bunny Entering The Sets Has The Moment Been Fixed

సంధ్య థియేటర్ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ పెద్దగా బయటకు వచ్చే ప్రయత్నం చేయటం లేదు. ఆ ఇష్యూ తర్వాత అల్లు అర్జున్ పరువు పోయింది అనే కామెంట్స్ కూడా గట్టిగానే వచ్చాయి. ఇక అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ చేసిన బిహేవియర్… అలాగే మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ విషయంలో చాలా సీరియస్ గానే బిహేవ్ చేశారు. దీనితో అల్లు అర్జున్ ప్రస్తుతం సైలెంట్ గానే ఉంటున్నాడు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ అయ్యే ప్రయత్నం చేయటం లేదు.

ఇక ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా ఈ హీరో ఆలోచన ఏంటి అనేది క్లారిటీ రావడం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్న సినిమా ఎలా ఉండబోతుంది, ఏంటి అనేదానికి సంబంధించి… ఇంకా ఎటువంటి క్లారిటీ డైరెక్టర్ గాని హీరో గాని నిర్మాతలు గాని ఇవ్వలేదు. అసలు ఈ సినిమా ఉందా లేదా అనేదానిపై కూడా స్పష్టత లేదు. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లని ఈ మధ్యకాలంలో ప్రచారం జరిగింది. కానీ సినిమా ముందుకెళుతుందా లేదా అనేదానిపై మాత్రం మేకర్స్ ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు.

ఎప్పుడో రెండు నెలల క్రితం ఈ సినిమాను జనవరిలో మొదలుపెడతామని నిర్మాత సూర్యదేవర నాగావంశీ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. భారీ బడ్జెట్ తో చేస్తున్న ఈ సినిమాను ఒక వీడియో రిలీజ్ చేసే షూటింగ్ స్టార్ట్ చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చాడు. కానీ షూటింగ్ మాత్రం ఇప్పటివరకు ముందుకు వెళుతున్నట్లు ఎటువంటి సిగ్నల్స్ రాలేదు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ సినిమా విషయంలో డ్రాప్ అయిపోయాడు అని.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా చేయకపోవడం మంచిది అనే ఒపీనియన్ లో ఆయన ఉన్నట్లుగా సమాచారం వచ్చింది.

అయితే ఇప్పుడు అవేవీ నిజం కాదని ఈ సినిమా షూటింగ్ కు రెడీ అవుతుందనే ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ కూడా సినిమా షూటింగ్ విషయంలో రెడీగా ఉండటం.. ఈ సినిమాను ఎలాగైనా ఏడాదిలో కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకోవడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే కంప్లీట్ చేసేసాడు. ఈ సినిమాను త్రివిక్రమ్ కెరీర్ లోనే డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కథ విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసిన త్రివిక్రమ్ అల్లు అర్జున్ ఇమేజ్ ఎక్కడా తగ్గకుండా, నార్త్ ఇండియా మార్కెట్ కు ఎక్కడ మైనస్ అవ్వకుండా ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పుష్ప సీక్వెల్ తర్వాత నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ కు భారీగా మార్కెట్ క్రియేట్ అయింది. ఆ మార్కెట్ ను మరింతగా పెంచే విధంగానే ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.