ముసలి హీరోయిన్ తో బన్నీ స్టెప్ లు, సుక్కు ప్లాన్ ఏంటో…?

పుష్ప 2 సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హీట్ పెంచేస్తుంది. ఎప్పుడు విడుదల చేస్తారు మాస్టారూ అంటూ ఫ్యాన్స్... డైరెక్టర్ సుకుమార్ పై సీరియస్ అయిపోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 13, 2024 | 11:43 AMLast Updated on: Aug 13, 2024 | 11:43 AM

Bunny Steps With The Old Heroine What Is Sukkus Plan

పుష్ప 2 సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో హీట్ పెంచేస్తుంది. ఎప్పుడు విడుదల చేస్తారు మాస్టారూ అంటూ ఫ్యాన్స్… డైరెక్టర్ సుకుమార్ పై సీరియస్ అయిపోతున్నారు. బాహుబలి 2 కే రెండేళ్ళు పడితే పుష్ప 2 కి మూడేళ్లు దాటిపోయింది అని… వేరే హీరోల సినిమాలు వరుస పెట్టి వస్తున్నా మాకు ఈ మెంటల్ టార్చర్ ఏంటీ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అయిపోతున్నారు. బన్నీ కెరీర్ లో దాదాపు 5 ఏళ్ళ పాటు పుష్ప సీరీస్ కోసమే పోయింది. మరో సినిమా లేకుండా ఈ 5 ఏళ్ళు ఆ సినిమా మీదనే ఉన్నాడు.

ఈ ఏడాది డిసెంబర్ లో సినిమా విడుదల అవుతుందని నిర్మాత బన్నీ వాసు నుంచి ఒక ప్రకటన కూడా వచ్చింది. కాని సినిమా షూటింగ్ మాత్రం ఇంకా మొదలు కాలేదు. 30 రోజుల పాటు సినిమా షూటింగ్ పెండింగ్ లో ఉంది. ఈ టైం లో మంచి జోష్ ఇచ్చే న్యూస్ వచ్చింది. అదే “పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ లో చిరంజీవి హీరోయిన్” అంటూ… పుష్ప 1 లో సమంతాతో ఐటెం సాంగ్ చేయించిన సుకుమార్… ఇప్పుడు పుష్ప 2 లో చిరంజీవితో కలిసి ఆపద్బాంధవుడు సినిమాలో నటించిన మీనాక్షి శేషాద్రిని ఎంపిక చేసాడట.

ఆమె వయసు దాదాపు 60 ఏళ్ళు. 15 ఏళ్ళ నుంచి ఆమె సినిమాలకు దూరంగా ఉంది. అలాంటి మాజీ హీరోయిన్ తో ఇప్పుడు ఎలా సాంగ్ చేయిస్తాడు అంటూ ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు. ఈ సాంగ్ ను అనంత శ్రీరాంతో కుర్రాళ్ళకు మతి పోగొట్టే విధంగా రాయించారట లెక్కల మాస్టారు. మరి బన్నీతో ముసలి హీరోయిన్ ఎలా స్టెప్ లు వేస్తుందో చూడాలి. ఈ ట్రెండ్ ఇప్పటికే బాలీవుడ్ లో ఉంది. మాధురి దీక్షిత్ సహా కొందరు మాజీ హీరోయిన్ లు యంగ్ హీరోలతో డాన్స్ లు వేయడం చూస్తున్నాం. ఈ ట్రెండ్ ను ఇప్పుడు సుకుమార్ తెలుగు జనాలకు పరిచయం చేస్తున్నారు.