బన్నీ – త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ట్రెండ్ సెట్టర్, జనవరిలో పుష్ప ఆర్మీకి రెండు పండుగలు
పుష్ప సినిమా ఏ ముహూర్తంలో బన్నీ ఫైనల్ చేసాడో గాని అక్కడి నుంచి పట్టింది 24 క్యారెట్ గోల్డ్ అయిపోతుంది. బన్నీ దెబ్బకు ఇప్పుడు బాలీవుడ్ కూసాలు కూడా కదులుతున్నాయి.
పుష్ప సినిమా ఏ ముహూర్తంలో బన్నీ ఫైనల్ చేసాడో గాని అక్కడి నుంచి పట్టింది 24 క్యారెట్ గోల్డ్ అయిపోతుంది. బన్నీ దెబ్బకు ఇప్పుడు బాలీవుడ్ కూసాలు కూడా కదులుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ రాజమౌళి పుణ్యమా అని స్టార్ హీరోలు అయితే బన్నీ మాత్రం రాజమౌళి మాట లేకుండా ఇప్పుడు పాన్ ఇండియాను ఏలుతున్నాడు. పుష్ప 2 కూడా హిట్ అయింది అంటే ఇక బన్నీకి తిరుగు ఉండదు. పుష్ప 2 కచ్చితంగా హిట్ కాబట్టే పుష్ప మేకర్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
టాలీవుడ్ లో పుష్ప సినిమాపై ఓ రేంజ్ అంచనాలు ఉంటే బాలీవుడ్ లో మాత్రం పుష్ప దెబ్బకు భయం మొదలయింది. పుష్ప సినిమాను ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ప్రమోట్ చేయడానికి ప్లాన్ రెడీ చేసారు. అమెరికాలో కూడా ఓ ఈవెంట్ ను ప్లాన్ చేసింది పుష్ప టీం. ఆస్ట్రేలియాలో డేవిడ్ వార్నర్ ను రంగంలోకి దించి ప్రమోట్ చేయించడానికి రెడీ అయ్యారు. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ రేంజ్ కచ్చితంగా మారిపోతుంది. ప్రభాస్ మాదిరిగా వరుస సినిమాలకు కూడా సైన్ చేసినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు త్రివిక్రమ్ తో ఒక ప్రాజెక్ట్ ను ఫైనల్ చేసాడు.
పుష్ప రిలీజ్ అయిన తర్వాత జనవరిలో ఆ సినిమా షూట్ ఉండే ఛాన్స్ ఉందని ముందు నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అది నిజమే అని ప్రకటించాడు నిర్మాత సూర్యదేవర నాగ వంశీ. జనవరిలోనే ప్రోమో ఒకటి రిలీజ్ చేసి సినిమాను గ్రాండ్ గా స్టార్ట్ చేస్తామని చెప్పాడు. ఇక ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పుడు త్రివిక్రమ్ గట్టిగానే వర్క్ చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో ఒకరిని ఈ సినిమాలో తీసుకునే ప్లాన్ మొదలుపెట్టాడు. విలన్ గా బాబీ డియోల్ ను ఫైనల్ చేసే ఛాన్స్ కనపడుతోంది. బాబీ డియోల్ తో ఇప్పటికే నిర్మాతలు డిస్కస్ చేసారని టాక్.
ఇక త్రివిక్రమ్ మరో ఆలోచన కూడా చేస్తున్నట్టు టాక్. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ను ఫైనల్ చేయవచ్చని తెలుస్తోంది. మృణాల్ ను కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ లో తీసుకోవాలని, ఆమెకు కీ రోల్ ఇవ్వాలని మాటల మాంత్రికుడు ప్లాన్ చేస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సినిమాను వచ్చే ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక పుష్ప షూటింగ్ దాదాపుగా ఫినిష్ అయిన సంగతి తెలిసిందే.