Businessman: రీ రిలీజ్‌లో దుమ్ము రేపుతోన్న బిజినెస్‌మేన్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతోన్న టికెట్స్

2012 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన బిజినెస్‌మేన్ అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ మూవీని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 6, 2023 | 11:52 AMLast Updated on: Aug 06, 2023 | 11:52 AM

Businessman Movie Re Releasing This August 9th

Businessman: టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే కోవలో త్వరలో మహేశ్ బాబు సూపర్ హిట్ మూవీ బిజినెస్‌మేన్ మూవీ కూడా రీ రిలీజ్ కాబోతుంది. ఈ నెల మహేశ్ బాబు పుట్టినరోజు కానుకగా ఈ సినిమా రీ రిలీజ్ అవుతోంది. పోకిరి సినిమాతో మహేశ్ బాబుకు బ్లాక్‌బస్టర్ అందించాడు పూరి జగన్నాథ్. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసింది.

ఈ కాంబోలో తెరకెక్కిన భారీ మాస్ యాక్షన్ మూవీ బిజినెస్ మేన్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ 2012 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీలో సూర్య భాయ్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్బ్ పెర్ఫార్మన్స్ ని ఆయన ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ మూవీని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు.

ఇక అమెరికాతోపాటు, రెండు తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో బిజినెస్ మేన్ బుకింగ్స్ ఓపెన్ కాగా అనేక ప్రాంతాల్లో టికెట్స్ కేవలం క్షణాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా నైజాం, ఆంధ్ర, సీడెడ్, బెంగళూరు సహా అనేక ప్రాంతాల్లో మహేష్ బాబు మరొక్కసారి సూర్య భాయ్ గా తన హవా కొనసాగిస్తున్నారని, మరి ఈ మూవీ రీ రిలీజ్ కి మొత్తంగా ఎంత మేర కలెక్ట్ చేస్తుందో చూడాలని పలువురు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి దాకా అందరు హీరో ల సినిమాల రీ రిలీజ్ బిజినెస్ లన్ని ఒక లెక్క.. – పండుగాడి బిజినెస్ మరో లెక్క అని హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు ఫాన్స్