Mahesh Babu: బిజినెస్‌మేన్ మొదటి హీరో మహేశ్ కాదా.. ఈ సినిమా వదులుకున్న స్టార్ ఎవరంటే..

బిజినెస్‌మేన్‌లాంటి బ్లాక్ బస్టర్ మూవీని ఓ స్టార్ హీరో మిస్ చేసుకున్న విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. బిజినెస్‌మేన్‌లో మహేష్ బాబు పోషించిన సూర్య భాయ్ పాత్రకి చాలామంది అభిమానులు ఫిదా అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 4, 2024 | 07:58 PMLast Updated on: Mar 04, 2024 | 7:58 PM

Businessmans Businessman Movie First Hero Is Not Mahesh Babu

Mahesh Babu: మహేశ్‌ బాబు బిజినెస్‌మేన్ సినిమా వ‌చ్చి 12 ఏళ్లు పూర్తయిపోయింది. 2012 జనవరి 13న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మహేశ్‌ బాబుతో రెండోసారి పని చేసిన దర్శకులు హిట్ ఇవ్వరు అనే బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చెప్తూ.. పూరీ జగన్నాథ్ వరుసగా రెండో విజయం అందించాడు. పోకిరి తర్వాత చేసిన బిజినెస్‌మేన్‌తో మరోసారి థియేటర్స్‌లో రచ్చ చేసారు పూరి-మహేశ్. అప్పటికే దూకుడుతో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ కొట్టిన మహేశ్‌.. సంక్రాంతికి వచ్చి బిజినెస్‌మేన్‌తో మరో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను కేవలం 80 రోజుల్లోనే పూర్తి చేసి ఔరా అనిపించాడు పూరీ జగన్నాథ్.

Vijay Devarakonda: ముగ్గురు దర్శకులతో సినిమాలు మొదలెట్టనున్న రౌడీ హీరో..

భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. పూరీ మార్క్ స్క్రీన్‌ప్లేతో పాటు డైలాగ్స్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. అయితే అలాంటి బ్లాక్ బస్టర్ మూవీని ఓ స్టార్ హీరో మిస్ చేసుకున్న విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. బిజినెస్‌మేన్‌లో మహేష్ బాబు పోషించిన సూర్య భాయ్ పాత్రకి చాలామంది అభిమానులు ఫిదా అయ్యారు. యాక్షన్ పాత్రలో చేయలేరు అని అనుకున్న కొంతమందికి మహేష్ బాబు చేసిన ఈ సినిమా చెంపపెట్టు లాంటిది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా మహేష్ బాబు చేయాల్సింది కాదట. ఈ సినిమాని మరో కొలీవుడ్ హీరో చేయాల్సిందట. ఆ హీరో ఎవరో కాదు.. తమిళ స్టార్ సూర్య. అలాగే ఈ స్టోరీ కూడా పూరి జగన్నాథ్‌ది కాదట. ఈ కథ ఆర్జీవీదట. రక్త చరిత్ర 2 సినిమా షూటింగ్ సమయంలో ఆర్జీవికి బిజినెస్‌మేన్‌ స్టోరీ లైన్ గుర్తుకొచ్చి ఈ మూవీ చేయాలి అనుకున్నారట. అయితే ఈ స్టోరీ లైన్ సూర్యకి చెప్పగా డెవలప్ చేయండి.. తర్వాత చేద్దాం అని చెప్పారట.

అయితే ఈ స్టోరీ లైన్ ఆర్జివి తన శిష్యుడైన పూరి జగన్నాథ్‌కి చెప్పడంతో పూరికి కూడా ఇది బాగా నచ్చి ఈ కథను మరింత డెవలప్ చేశారట. ఇక తర్వాత ఆర్జీవికి ఈ విషయం చెప్పగా పూరినే ఈ సినిమా తెరకెక్కించుకోమని చెప్పారట. అలా ఈ స్టోరీ పూరి జగన్నాథ్ చేయాల్సి వచ్చింది. అలాగే ఈ సినిమా కోసం సూర్యని సంప్రదించగా అప్పటికే వరుస సినిమాల్లో బిజీగా ఉండడం కారణంగా సూర్య ఈ మూవీ రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత మహేష్ బాబుతో పూరి జగన్నాథ్ ఒక సినిమా చేద్దాం అని చెప్పడంతో కథ కూడా వినకుండానే ఓకే చేసి షూటింగ్ కంప్లీట్ చేశారట. ఎందుకంటే ఈయనకు పోకిరి సినిమా టైంలో ఏర్పడిన నమ్మకం వల్ల కథ వినకుండానే సినిమా చేశారట. అలా సూర్య చేయవలసిన బిజినెస్ మాన్ మూవీ మహేష్ బాబు చేశారు.