Adipurush: అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన ఆదిపురుష్ మేకర్స్.. అదేంటంటే..

ఆదిపురుష్ సినిమా మీద ఏ రేంజ్‌లో హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంత క్రేజ్ ఉన్న సినిమాకు ఒకే టికెట్ ధరకు రెండు టిక్కెట్లు వస్తే ఎలా ఉంటుంది? ఆఫర్ అదిరిపోయింది కదా! ఆదిపురుష్ సినిమాకు ఇప్పుడు ఇదే ఆఫర్ ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది నిర్మాణ సంస్థ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 11, 2023 | 02:38 PMLast Updated on: May 11, 2023 | 2:38 PM

Buy One Get One Free On Adipurush Movie Tickets

Adipurush: ఆదిపురుష్ సినిమా మీద ఏ రేంజ్‌లో హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్‌ను సిల్వర్ స్క్రీన్ మీద రాముడిగా చూసేందుకు ఆయన ఫాన్స్ మాత్రమే కాదు దేశం మొత్తం ఎదురు చూస్తోంది. సర్వర్‌లు క్రష్ అయ్యే రేంజ్‌లో టికెట్లు బుక్ చేసేందుకు డార్లింగ్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. ఇంత క్రేజ్ ఉన్న సినిమాకు ఒకే టికెట్ ధరకు రెండు టిక్కెట్లు వస్తే ఎలా ఉంటుంది? ఆఫర్ అదిరిపోయింది కదా!

ఆదిపురుష్ సినిమాకు ఇప్పుడు ఇదే ఆఫర్ ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది నిర్మాణ సంస్థ. పేటీఎంలో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. అయితే, ఇందుకు కొన్ని షరతులు మాత్రం వర్తిస్తాయని వెల్లడించింది పేటీఎం. ఈ ఆఫర్‌ జూన్‌ 30 వరకే ఉంటుందని తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా ముందుగా 100 రూపాయలు చెల్లిస్తే ప్రోమో కోడ్‌ వస్తుంది. టికెట్‌ బుక్‌ చేసుకునే ముందు దాన్ని అప్లై చేస్తే 400 వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుందని పేర్కొంది.

కనీసం 350 ధర ఉన్న టిక్కెట్లకు ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపింది. అంటే.. రెండు టికెట్లు బుక్‌ చేయాల్సి వస్తే ట్యాక్స్‌తో కలిపి 700కి పైగా అవుతుంది. అదే పేటీఎం ఆఫర్‌ కోడ్‌ని ఉపయోగిస్తే సగం ధరకే టికెట్ లభిస్తుంది. అంటే ఒక టికెట్ ధరకే రెండు టిక్కెట్లు వస్తాయన్నమాట. ఇదేదో బాగుంది కదూ!