Pawan Kalyan : సినిమాలకు బైబై! సినిమాలకు పవన్ ఇక సెలవేనా ?

జనసేనాని (Janasena) పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan).. ఇప్పుడు మంత్రి పవన్ కల్యాణ్ అయ్యారు. సేనానికి డిప్యూటీ సీఎం (Deputy CM) పదవితో పాటు కీలక పదవులు అప్పగించారు చంద్రబాబు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 14, 2024 | 06:00 PMLast Updated on: Jun 14, 2024 | 6:00 PM

Bye Bye Movies Will Pawan Leave For Movies

 

 

జనసేనాని (Janasena) పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan).. ఇప్పుడు మంత్రి పవన్ కల్యాణ్ అయ్యారు. సేనానికి డిప్యూటీ సీఎం (Deputy CM) పదవితో పాటు కీలక పదవులు అప్పగించారు చంద్రబాబు. పంచాయితీ, రూరల్ డెవలప్‌మెంట్‌, రూరల్ వాటర్ సప్లై, అటవీ శాఖ, పర్యావరణ శాఖలను అప్పగిస్తూ చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. కీలక శాఖలు అప్పగించడంతో.. పవన్ బాధ్యత మరింత పెరిగినట్లు అయింది. ఐతే ఇన్ని బాధ్యతలు మోస్తూ… ఇకపై ఆయన సినిమాల్లో కనిపిస్తారా.. అసలు సినిమాలు చేస్తారా లేదా అనే టెన్షన్‌.. పవన్ ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది. పవన్ కేవలం ఎమ్మెల్యే మాత్రమే అయుంటే.. సినిమాల్లో నటించిన ఆయన మీద పెద్దగా ఎవరూ విమర్శలు చేసి ఉండే వారు కాదు.

ఐతే ఇప్పుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాతో పాటు పలు శాఖలకు అధిపతి కావడంతో.. సినిమాల్లో నటిస్తే తీవ్ర విమర్శలను ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందనే చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం… గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, గ్రామీణ తాగునీటితో పాటు అడ‌వుల్లాంటి కీల‌క శాఖ‌లు పవన్ చేతుల్లో ఉన్నాయ్. ఇవన్నీ ప్రతీరోజు జ‌నంతో మ‌మేకం అయ్యే శాఖ‌లే.. ప్రతీరోజు పర్యటనలు నిర్వహిస్తూ.. రివ్యూలు చేస్తూ, నిర్ణయాలు తీసుకునే శాఖ‌లే. మరి ఇన్ని బాధ్యతలు మోస్తూ.. పవన్ సినిమాలు కూడా చేస్తారా అంటే.. అది సాధ్యం అయ్యే పని కాదని మెజారిటీ జనాల నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. ఉస్తాద్ భగత్‌సింగ్‌, ఓజీ, హరిహర వీరమల్లుతో పాటు.. ఇంకొన్ని సెట్స్ మీదకు వెళ్లాల్సిన సినిమాలు ప్రస్తుతం పవన్ చేతిలో ఉన్నాయ్. మరి ఆ మూవీ షూటింగ్‌లకు డేట్లు అడ్జస్ట్ చేసి.. పరిపాల‌న‌కు అవ‌కాశం ఉంటుందా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్.

ప‌వ‌న్ ఏరీకోరి ఈ శాఖ‌లు తీసుకున్నార‌ని… ఆయ‌న జ‌నంతో మ‌మేకం అయ్యే శాఖ‌లు కావాల‌ని ప్రచారం జరుగుతోంది. ఐతే బాగా ఆలోచించే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారని.. సెట్స్‌పై ఉన్న సినిమాల‌కు డేట్స్ అడ్జెస్ట్ చేసి, కొత్త సినిమాలు ఒప్పుకోక‌పోవ‌చ్చంటూ జ‌న‌సేన వ‌ర్గాల స‌మాచారం. ప‌వ‌న్ స్క్రీన్ మీద క‌న‌ప‌డ‌క పోతే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా లేదా అన్నది ఇప్పుడు మిలియన్‌ డాలర్‌ ప్రశ్న.