ఆల్లు ఆర్మీ కాపాడగలదా… కొరివితో తలిగోక్కునే రిస్క్…?
త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఇండస్ట్రీలో గురూజీ అని గౌరవంగా పిలుచుకుంటారు. ఐతే కొన్నేళ్లుగా ఈ గురూజీ గురి కుదరట్లేదు. అల వైకుంఠపురంలో మూవీ 2020 లో అంటే కరోనా కంటే ముందొచ్చింది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఇండస్ట్రీలో గురూజీ అని గౌరవంగా పిలుచుకుంటారు. ఐతే కొన్నేళ్లుగా ఈ గురూజీ గురి కుదరట్లేదు. అల వైకుంఠపురంలో మూవీ 2020 లో అంటే కరోనా కంటే ముందొచ్చింది. ఐకాన్ స్టార్ ని 200 కోట్ల కబ్ల్ లో చేరేలా చేసింది. అలా తొలిసారి బన్నీ కెరీర్ లో వసూళ్లతో డబుల్ సెంచరీ వచ్చేలా చేశాడు మాటల మాంత్రికుడు.
అలాంటి తనేకే దూరంగా పారిపోయే పరిస్థితి వచ్చిందా? నిజం చెప్పాలంటే పుష్ప కి ముందు బన్నీ స్టైలిష్ స్టారే కావొచ్చు. కాని పుష్ప హిట్ తో అల్లు అర్జున్ స్థాయే మారిపోయింది. పాన్ ఇండియా లెవల్లో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. పుష్ప 2 తో ఈజీగా వెయ్యికోట్లు రాబట్టేస్తాడనేంతగా అంచానాలను పెంచేస్తున్నాడు
ఇలాంటి టైంలో మాటల మాంత్రికుడితో బన్నీ సినిమా అంటే నిజంగానే రిస్కే. ఎందుకంటే, ఇప్పుడు త్రివిక్రమ్ మేకింగ్ మీద, పెద్ద హీరోల్లో చాలా వరకు స్టార్స్ కి అనుమానాలున్నాయంటున్నారు. మొన్నటికి మొన్న 4 ఏల్ల గ్యాప్ తర్వాత త్రివిక్ర్ తీసిన గుంటూరు కారం చూసి, నాసీరకం స్క్రిప్ట్ అనేశారు
దీనికి ముందు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ తో సినిమా ప్లాన్ చేసి, మధ్యలోనే వద్దనుకుని బయటికొచ్చేశాడు. ఇక రెబల్ స్టార్ కి కూడా కథ చెప్పిన త్రివిక్రమ్ కి అక్కడ నో అన్న ఆన్సరే దక్కింది. సో ఎలా చూసినా త్రివిక్రమ్ తో సినిమా అంటే చాలా వరకు పెద్ద హీరోలు సిద్దంగా లేరట. మరి ఇలాంటి టైంలో బన్నీ తనతో సినిమా చేసి కెరీర్ ని రిస్క్ లో పెడుతున్నాడా? ఈ డౌట్ సాధారణంగా ఎవరికైనా రావాలి. కాని జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో అంటూ హ్యాట్రిక్ ఇచ్చిన డైరెక్టర్ అన్న కృతగ్నతా కోనంలోనే బన్నీ ఇలా మాటల మాంత్రికుడికి ఛాన్స్ ఇచ్చాడేమో అనంటున్నారు. మొన్నటి వరకు ఆట్లి తో సినిమా అని, గురూజీతో రిస్క్ వద్దనుకున్న బన్నీ, మళ్లీ త్రివిక్రమ్ కే ఛాన్స్ ఇవ్వటం అంటే రిస్క్ చేయటమే అన్న కామెంట్స్ పెరిగాయి.