300 కోట్ల హీరోకు దర్శకుడు దొరకడం లేదా.. ఇదెక్కడి విచిత్రంరా బాబు..!

మామూలుగానే ఒక పెద్ద హిట్ వచ్చినప్పుడు హీరోలు ఒక జోష్ మీద ఉంటారు. నెక్స్ట్ ఏం చేయాలన్నా కూడా కాస్త ఆలోచించి అడుగులు వేస్తారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 20, 2025 | 01:09 PMLast Updated on: Mar 20, 2025 | 1:09 PM

Cant Find A Director For A 300 Crore Hero Whats So Strange About This Babu

మామూలుగానే ఒక పెద్ద హిట్ వచ్చినప్పుడు హీరోలు ఒక జోష్ మీద ఉంటారు. నెక్స్ట్ ఏం చేయాలన్నా కూడా కాస్త ఆలోచించి అడుగులు వేస్తారు. అయితే ఇది కుర్ర హీరోల విషయంలో మేము ఉంటుంది.. కానీ సీనియర్స్ కూడా ఇదే దారిలో వెళ్తే మాత్రం కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల తమ కెరీర్లు ఎన్నో పెద్ద పెద్ద విజయాలు చూసి ఉంటారు ఆ హీరోలు. తాజాగా వెంకటేష్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కొన్ని సంవత్సరాలుగా సరైన బ్లాక్ బస్టర్ లేని వెంకీకి సంక్రాంతికి వస్తున్నాం ఆ లోటు తీర్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి విడుదలై ఏకంగా 300 కోట్లు వసూలు చేసింది. పండక్కి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని తెలుసు కానీ ఈ రేంజ్ లో హిట్ అవుతుందని మాత్రం ఎవరు ఊహించలేదు. అంతెందుకు వెంకటేష్, అనిల్ రావిపూడి కూడా తమ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు.

ఏకంగా ఇండస్ట్రీ హిట్ వచ్చేసరికి నెక్స్ట్ ఏం చేయాలి అనే విషయం మీద కన్ఫ్యూజ్ అవుతున్నాడు వెంకటేష్. ఈయన తర్వాత సినిమా కోసం చాలామంది నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఇప్పటికే సొంత ప్రొడక్షన్ సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, షైన్ స్క్రీన్స్ లాంటి వాళ్ళు వెంకటేష్ కు అడ్వాన్స్ లు ఇచ్చారు. వీళ్లలో ఏదో ఒక నిర్మాణం సంస్థతో నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు వెంకీ. కాకపోతే దానికి దర్శకుడు ఎవరు అనేది మాత్రం కన్ఫ్యూజన్. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత దాదాపు 25కి పైగా కథలను విన్నానని.. కానీ ఇప్పటివరకు ఏ ఒక్కటీ తనకు నచ్చలేదు అంటున్నాడు వెంకీ.

ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఒక స్ట్రాంగ్ స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. రవితేజతో ప్రస్తుతం మాస్ జాతర సినిమా తెరకెక్కిస్తున్న భాను భోగవరపు చెప్పిన ఒక కథకు వెంకీ ఇంప్రెస్ అయ్యాడని తెలుస్తుంది. పూర్తిగా తన స్టైల్లో సాగే కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అందుకే భాను చెప్పిన కథను సీరియస్ గా తీసుకుంటున్నాడు వెంకీ. మాస్ జాతర తర్వాత ఈ లైన్ మీద కూర్చొని ఉన్నాడు భాను. మరోవైపు సురేందర్ రెడ్డి చెప్పిన కథకు కూడా వెంకటేష్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఏజెంట్ తర్వాత పూర్తిగా కనిపించడమే మానేశాడు సూరి. పవన్ కళ్యాణ్ తో సినిమా అనుకున్న కూడా అది వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. దాంతో వెంకటేష్ మీదే ఆశలు పెట్టుకున్నాడు ఈయన. మరి వీటిలో ఏది ఫైనల్ అవుతుందో చూడాలి.