Dhanush: అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్న హీరో
ధనుష్ కి అవమానాలు కొత్తకాదు. కెరీర్ బిగినింగ్ లోనే రిక్షావోడిలా ఉన్నావు నువ్వెలా హీరో అన్నారు. బాలీవుడ్ లో రాంజ్ నా మూవీ చేసేప్పుడైతే ఆఫీస్ బాయ్, సెట్ బాయ్ అంటూ కామెంట్లు చేసేవాళ్లట. కొందరైతే టీ తెమ్మని కూడా అవమానించారట. ఇలా బాడీ షేమ్ ని ఫేస్ చేసీన ఈ హీరో తెలుగులో సర్ అంటూ హిట్ కొట్టాడు. తమిళ్, మలయాళంలో మంచి మార్కెట్ సొంతం చేసుకున్నాడు.

Captain Miller did not come forward to buy the movie rights. If Dhanush was going to talk to Yash Raj Production, they sent him away
ఇక ఫ్రెంచ్ మూవీ ది ఎక్స్ ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫకీర్, హాలీవుడ్ మూవీ దీ గ్రేమ్యాన్ లో మెరిశాడు. సో ఇంత జర్నీ చేసినా.. ఎంత పేరొచ్చినా తనకి అదృష్టంతోపాటు అరిష్టం కూడా ఉన్నట్టుంది. ప్రభాస్, చరణ్, బన్నీ, తారక్, విజయ్, సూర్య, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలకంటే ముందే పాన్ ఇండియా లెవల్లో ఒక్కో భాషలో ఒక్కో మూవీ చేస్తూ నటుడిగా పేరుతెచ్చుకున్న ధనుష్ కి, మార్కెట్ మాత్రం పెరగలేదు.
క్రేజ్ కాని ఇమేజ్ కాని కొత్తగా పెరిగింది లేదు. తమిళ నాడులో మాస్ కమ్ క్లాస్ హీరో ఉండొచ్చు. తెలుగులో సర్ లాంటి హిట్ వల్ల మార్కెట్ పెరగొచ్చు. కాని తన సినిమా కోసం ఇక్కడ క్యూలో నిలుచునేంత క్రేజ్ లేదు. హిందీలో అసలు అలాంటి పరిస్థితి కనపడదు. ఎంత హాలీవుడ్ మూవీలు చేసినా ఆ స్థాయి ఇంకా రాలేదు. ఇలాంటి టైంలో కెప్టెన్ మిల్లర్ వస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తనకి మొదటి పరీక్ష ఎదురౌతోంది. కాని బాలీవుడ్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమా రైట్స్ కొనేందుకు ముందుకు రాలేదట. ధనుషే యష్ రాజ్ ప్రొడక్షన్ ని కలసి మాట్లాడబోతే, నోచెప్పి పంపించేశారట. ఇదే ఇప్పడు కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హాట్ టాపిక్ అయ్యింది.